Allu Sirish: అల్లువారి అబ్బాయి ప్రేమలో పడ్డాడా? వారిద్దరి ప్రేమాయణం స్క్రీన్ వరకేనా?
అల్లు శిరీష్ ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమో మాత్రం తెలియదు.
అను ఇమ్మాన్యుయెల్, అల్లు శిరీష్ జంటగా నటిస్తున్న సినిమా ‘ప్రేమ కాదంట’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సాగుతోంది. ఇదొక రొమాంటిక్ ప్రేమకథ. అయితే వీరి మధ్య ఆన్ స్క్రీన్‌లోనే కాదు, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ప్రేమ ప్రయాణం సాగుతున్నట్టు టాలీవుడ్ టాక్. అల్లు శిరీష్ అను ఇమ్మాన్యుయేల్ ను ఇష్టపడుతున్నాడని, అందుకు అను కూడా ఓకే అందని సమాచారం. అను హీరోయిన్‌గా మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, నా పేరు సూర్య, శైలజా రెడ్డి అల్లుడు, మహా సముద్రం ఇలా అనేక సినిమాల్లో నటించింది. శిరీష్‌కి మాత్రం ఇది ఆరో సినిమా.
క్రిస్‌మస్ సందర్భంగా అల్లు శిరీష్, అనుకు ప్రత్యేకంగా కేకును పంపించారు. ఆ విషయాన్ని అను తన ఇన్‌స్టాగ్రామ్ లో స్టేటస్లో షేర్ చేసుకుంది. కేకుపై ‘హ్యాపీ క్రిస్మస్ టు మై ఫేవరేట్ కోస్టార్’ అని రాసి పంపించారు అల్లు వారబ్బాయి. చివర్లో ముద్దు పెట్టిన సౌండుని కూడా పదాల రూపంలో రాసి పంపించారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయారని భావిస్తున్నారు నెటిజన్లు. ఆ కేకును అందుకున్న అను ‘లవ్డ్ ద కేక్, థాంక్యూ అల్లు శిరీష్’ అని క్యాప్షన్ పెట్టింది. పోస్టు వైరల్ అయ్యాక నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా అంటూ ప్రశ్నలు అడగడం మొదలుపెటారు.
ఇక ‘ప్రేమ కాదంట’ సినిమా గురించి చెప్పాలంటే... ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, రాకేవ్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.
Also Read: విడిపోయిన అమ్మానాన్నల గురించి సారా అలీ ఖాన్ ఏమందంటే...
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: నానికి టికెట్ రేట్స్, కలెక్షన్స్ గురించి ఐడియా ఉందా? - ఏపీ ప్రభుత్వానికి మద్దతుగా నిర్మాత నట్టి
Also Read: ఏపీ సర్కార్ వారి సినిమా టికెట్ల ధరలివే.. మీ ఊర్లో సింగిల్ టీ కంటే సినిమా టికెట్ రేటే చీప్
Also Read: సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తే అవమానం ఎలా అవుతుంది... థియేటర్లపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయడం లేదు... హీరో నానికు మంత్రి బొత్స కౌంటర్
Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి