Dhruva Natchathiram: 'ధృవ నక్షత్రం' అప్‌డేట్ - పోస్టర్లతో ఊరించడమేనా? రిలీజ్ ఎప్పుడు చియాన్!
హీరో విక్రమ్ అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న 'ధృవ నక్షత్రం'పై అప్ డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 17న విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేయడం ఆయన ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహాన్నిస్తోంది..
Dhruva Natchathiram: తమిళ స్టార్ హీరో విక్రమ్ ఏ పాత్ర చేసినా ఛాలెంజింగ్ గా తీసుకుని చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న “ధృవ నక్షత్రం”కి సంబంధించి తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తోంది.
బహుముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న చియాన్ విక్రమ్ చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై అలరించనున్నారు. 'ధృవ నక్షత్రం' సినిమా అనౌన్స్ చేసి చాలా దాదాపు ఐదేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ విడుదల నోచుకోకపోవడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మేకర్స్ కు డైరెక్టర్ కు మధ్య జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీల వల్లనే ఈ సినిమా ఇప్పటివరకు రిలీజ్ కాలేదనే వార్తలూ అప్పట్లో సెన్సేషనల్ గా మారాయి. కానీ ఎట్టకేలకు ఈ సినిమా మళ్లీ పట్టాలపైకి ఎక్కినట్టు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో విక్రమ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
తాజాగా ఏప్రిల్ 17న హీరో విక్రమ్ బర్త్ డే సందర్భంగా ‘ధృవ నక్షత్రం చాప్టర్ 1 యుద్ధకాండం’ టైటిల్ తో వస్తోన్న మూవీపై మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. డైరెక్టర్ గౌతమ్ మీనన్.. ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విక్రమ్ తో పాటు మరో నలుగురు నడుచుకుంటూ.. వస్తుండగా.. ఆకాశంలోనుంచి ఓ విమానం వెళ్తోంది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. భారీ అంచనాల నడుమ రూపొందుతోన్న ఈ చిత్రంలో హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక తదితరులు కూడా నటిస్తుండడం విశేషం. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా విక్రమ్ నటిస్తోన్న మరో ఇంట్రస్టింగ్ అండ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘తంగలాన్’ కు సంబంధించి కూడా ఓ ఆసక్తికరమైన మేకింగ్ వీడియోను ఆ సినిమా మేకర్స్ సోమవారం రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క యాక్షన్ సీన్ కూడా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విక్రమ్ పూర్తిగా డీగ్లామరైజ్డ్పాత్రలో కనిపిస్తున్నారు. దానికి తోడు జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. దీంతో ఈ మూవీపై ఎక్స్ప్టేషన్స్.. భారీగా పెరిగిపోయాయి.
Read Also: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందింది. అయితే, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగలన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు. అటు విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ‘పొన్నియిన్ సెల్వన్ 2’లోనూ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అదిత కరికాలన్ పాత్రను పోషిస్తున్నారు.