Ravanasura movie: ఓటీటీలోకి రవితేజ ‘రావణాసుర’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర రాణించలేకపోయిన ఈ మూవీ, త్వరలో ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది.
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా 'రావణాసుర'. ఇప్పటి వరకు రవితేజ మాస్, క్లాస్ క్యారెక్టర్లు చేశారు. రెండింటిలోనూ అదుర్స్ అనిపించుకున్నారు. కానీ తొలిసారి ఈ సినిమాలో నెగిటివ్ షెడ్ రోల్ చేశారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యిందనే చెప్పుకోవచ్చు. రవితేజతో పాటు సుశాంత్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించినా అంతగా ఆకట్టుకోలేదు. ‘ధమాకా’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.
మే మొదటి వారంలో ఓటీటీలోకి ‘రావణాసుర’
థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ OTT ప్లాట్ ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం మే 2023 మొదటి వారంలో OTTలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
అంచనాలను అందుకోలేకపోయిన ‘రావణాసుర’
ఈ సినిమా విడుదలకు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి. 'వాడు క్రిమినల్ లాయర్ కాదు... లా చదివిన క్రిమినల్' లాంటి డైలాగులు బాగా నచ్చాయి. డైలాగులకు తగ్గట్టు రవితేజను చాలా పవర్ ఫుల్ పాత్రలో సుధీర్ వర్మ ప్రజెంట్ చేస్తారని ప్రేక్షకులు భావించారు. యాక్షన్ ఎపిసోడ్ గ్లింప్స్ కూడా సినిమాపై హైప్ పెంచారు. కానీ, సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో అలరించలేకపోయింది. సిటీలో కొన్ని వరుస హత్యలు జరుగుతాయి. వాటిని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమా. మాంచి యాక్షన్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించి... కాసేపటికి రొటీన్ కథను మీకు ఈ విధంగా చెప్పామని క్లారిటీ ఇచ్చి... అంత కంటే రొటీన్ క్లైమాక్స్ చూపించిన సినిమా 'రావణాసుర'.
ఐదుగురు హీరోయిన్లున్నా ఆకట్టుకోలేకపోయారు!
ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు కనిపించినా మెప్పించలేకపోయారు. అనూ ఇమ్మానుయేల్, మేఘా ఆకాష్, 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా, 'బంగార్రాజు'లో ఓ పాటలో మెరిసిన దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ నటించారు. అభిషేక్ పిక్చర్స్ మరియు RT టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకులుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
View this post on Instagram
View this post on Instagram
Read Also: క్రికెటర్ ముత్తయ్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, ‘800‘ మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్