Dasara: 'దసరా' మాసీ లోకల్ స్ట్రీట్ సాంగ్ - నాని ఊరమాస్ స్టెప్స్!
నాని 'దసరా' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
నాని(Nani) కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా 'దసరా'(Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్స్ ను, చిన్న వీడియోను వదిలారు. తాజాగా సినిమాలో ఫస్ట్ సింగిల్ ను విడుదల చేశారు. 'ధూమ్ ధామ్ దోస్తాన్'(Dhoom Dhaan Dhosthaan Song) అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో నాని తన మాస్ డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, గొట్టే కనకవ్వ, గొన్నారా దస లక్ష్మి, పాలమూరు జంగిరెడ్డి, నరసన్న, కాసర్ల శ్యామ్ కలిసి ఆలపించారు. మాసిన గడ్డంతో మాస్ లుక్ లో నాని కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. ఫ్యామిలీ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఎప్పుడు నాని సినిమాలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది 2023, మార్చి 30న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. నాని సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి నేను లోకల్ సినిమాలో నటించారు. దర్శకుడు కొత్త వాడైనా ఈ సినిమాపై నాని ప్రేక్షకులు భారీ అంచలనాలు పెట్టుకున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తెలంగాణలోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ కంప్లీట్ కాగా.. రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలయినట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్, నవీన్ నూలి ఎడిటర్.
అవి కాకుండా పబ్లిసిటీ ఖర్చులు, వడ్డీలు ఎలాగూ ఉంటాయి. అలా చూసుకుంటే సినిమాకి మరింత ఎక్కువ బిజినెస్ జరగాలి. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ లవ్ ప్లాట్ ప్లాన్ చేశారు దర్శకుడు. రిచ్ అమ్మాయి.. స్లమ్ లో ఉండే అబ్బాయిని ప్రేమించడం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల 'దసరా' సినిమాలో కూడా ఇలాంటి ఒక లవ్ స్టోరీని చూపించబోతున్నారు. రాజుగారి కోట లాంటి ఇంట్లో ఉండే హీరోయిన్.. స్లమ్ లో ఉండే హీరోని ప్రేమిస్తుంది. ఈ ఎపిసోడ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. సినిమాకి ఇదొక ప్లస్ పాయింట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.