Dhanush Aishwarya Reunion: ధనుష్, ఐశ్వర్య విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్!
కోలీవుడ్ టాప్ హీరో ధనుష్, ఐశ్వర్య విడాకుల కేసు సుఖాంతం అయ్యింది. పిల్లల కోసం ఈ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి విడాకుల కేసు సమంత, నాగ చైతన్య వివోర్స్ కేసు. తొలి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఈ యువ జంట చివరకు విడాకులు తీసుకుంది. విడాకులకు కారణాలపై అనేక ఊహాగానాలు వినిపించినా.. అఫీషియల్ గా ఎవరూ బయటకు చెప్పలేదు. వీరిద్దరు విడాకులు తీసుకున్నాక.. ఎవరికి వారు కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. సమంతా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. నిజానికి సమంతా, నాగ చైతన్య మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని, విడాకులు తీసుకుంటారని చాలా కాలంగా వార్తలు వినిపించాయి. అనుకున్నట్లుగా చివరకు డివోర్స్ తీసుకున్నారు.
ఈ వార్తలు చల్లారక ముందే టాలీవుడ్ టాప్ హీరో ధనుష్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకోబోతున్నట్లు సంచల విషయాన్ని వెల్లడించాడు. ఈ ప్రకటనతో కోలీవుడ్ ఆశ్చర్యపోయింది. దాదాపు 18 ఏళ్ల పాటు సంసార జీవితాన్ని కొనసాగించిన వీళ్లు ఓ హీరోయిన్ కారణంగా గొడవలు పడ్డారని తమిళ మీడియా వెల్లడించింది. ఆ కారణంగానే విడాకులు తీసుకుంటున్నారని తెలిపింది. విడాకుల విషయాన్ని ధనుష్ అఫీషియల్ గా ప్రకటించినా.. కుటుంబ సభ్యులు మాత్రం అస్సలు అంగీకరించ లేదు. మీ కోసం కాకాపోయినా.. కనీసం పిల్లల కోసం అయినా కలిసి ఉండాలని సర్దిచెప్తూ వస్తున్నారట. ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజనీ కాంత్, ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఇద్దరి మధ్య తగవులను పరిష్కరించే ప్రయత్నం చేశారట. ఇద్దరిని ఒకే దగ్గర కూర్చోబెట్టి పలు మార్లు బతిమాలారట. వీరి ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించినట్లు తెలుస్తోంది. పిల్లల కోసం కలిసి ఉండేందుకు అంగీకారం చెప్పినట్లు సమాచారం.
గడిచిన కొద్ది కాలంగా ధనుష్ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా మారాడు. అయినా, కుటుంబ సభ్యులు అతడిని పిలిచి మాట్లాడారట. కలిసి ఉంటేనే మంచిదని హితవు పలికారట. చివరకు పెద్దల మాట కాదనలేక ధనుష్ ఓకే చెప్పారట. అటు ఐశ్వర్య కూడా తన తండ్రి మాటను గౌరవించిందట. రజనీ కాంత్ కోరిక మేరకు ధనుష్ తో కలిసి ఉంటానని చెప్పిందట.
వాస్తవానికి ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. కానీ, కుటుంబ సభ్యుల జోక్యంతో విడాకుల కోసం మాత్రం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో, వీరికి ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో మాదిరిగానే మళ్లీ కలిసి ఉండే అవకాశం ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టడం ఖాయం అని తమిళ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నది. తమ ప్రయత్నాలు సక్సెస్ కావడం పట్ల ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారట. సమస్యలను సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్లాలి తప్ప.. విడిపోకూడదని ఇద్దరీ సూచించారట. వీరి విడాకుల కథ సుఖాంతం కావడంతో నెటిజన్లు నాగ చైతన్య- సమంత విడాకుల గురించి కామెంట్స్ పెడుతన్నారు. ధనుష్, ఐశ్వర్య కుటుంబ సభ్యుల మారిగానే నాగ చైతన్య, సమంత పెద్దలు విడాకులు తీసుకోకుండా సర్దిచెప్తే బాగుండు అంటున్నారు నెటిజన్లు.