Devatha July 22 Update: కన్నతండ్రి మీద పగతో రగిలిపోతున్న దేవి- గుండెలవిసేలా ఏడుస్తున్న రుక్మిణి, సత్య మీద అరిచిన ఆదిత్య
దేవి, అదిత్యని శాశ్వతంగా దూరం చేసేందుకు మాధవ కుట్ర చేశాడు. తన కన్న తండ్రి దుర్మార్గుడు అని కథ అల్లి చెప్తాడు. అది నమ్మిన దేవి తండ్రి మీద పగ పెంచుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఆదిత్య అమెరికా వస్తాడనే నమ్మకం కూడా తనకి లేదని సత్య బాధపడుతుంది. దీని గురించి మాట్లాడేందుకు దేవుడమ్మ అదిత్యని పిలుస్తుంది. మనిషివి ఇంట్లో ఉంటున్నావే కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా పరధ్యానంగా ఉంటే ఎలా, నాకు తెలిసి నువ్వు ఇలా ఉన్నావంటే రుక్మిణి గురించే ఆలోచిస్తున్నావని అర్థం అవుతుంది కాస్త సత్య గురించి కూడా ఆలోచించు. ఒక పక్క అమెరిక ప్రయాణం కోసం ఏర్పాట్లు చేసుకుందని చెప్తుంది. ఎవరు ఎలా పోయిన పరవాలేదు మనం మాత్రం అమెరికా వెళ్ళాలి అంతే కదా అని ఆదిత్య సత్య మీద అరుస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. నా లవచ్చన ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఆలోచించకుండా అమెరికా వెళ్దామని అంటే ఎలా.. సరే అలాగే వెళ్దాం అనేసి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆదిత్య ప్రవర్తనకి సత్య బాధపడుతుంది.
Also Read: అల్లాడిన పసిమనసు, ఇల్లు వదిలి వెళ్ళిపోయిన ఖుషి- వేద, యష్ కి వార్నింగ్ ఇచ్చిన మాళవిక
దేవి మాధవ దగ్గరకి వస్తుంది. 'నువ్వు ఎంత మంచోడివి, మా నాయన మాయమ్మని గట్ల కొట్టి తిట్టి ఇంట్లో నుంచి పంపించేస్తే మాయమ్మ ప్రాణం కాపాడావ్.. ఇంట్లో మా అమ్మకి నాకు చోటు కల్పించావ్, సొంత బిడ్డ లెక్క అక్కతో సమానంగా నన్ను చూసుకున్నావ్, మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి సారు' అని దేవి బాధగా మాట్లాడుతుంది. అవన్నీ రుక్మిణి దూరం నుంచి వింటూ ఉంటుంది. సార్ ఏంటమ్మా నేను మీ నాన్నని సార్ అని పిలిచి నన్ను పరాయి వాడిని చెయ్యకు ఈ నాన్న తట్టుకోలేడు. నీ లాంటి కూతురు నాకు బిడ్డగా పుట్టలేదని నిజం చెప్పానే కానీ నీతో సార్ అని పిలిపించుకోవాలి నిన్ను దూరం చేసుకోవాలని కాదమ్మా అని కల్లబొల్లి కబుర్లు చెప్తాడు. అది విని రుక్మిణి కోపంతో రగిలిపోతుంది. నువ్వు మా సొంత నాయనవి కాదు కదా అని దేవి అంటే ఆ విషయం నేను చెప్తేనే కదా తెలిసింది.. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా కూతురివి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు తల్లి నీకు నిజం చెప్పి తప్పు చేసాను క్షమించమ్మా అని దొంగ నాటకాలు ఆడతాడు. మాయమ్మని బాధపెట్టిన మా నాయన కనపడాలి మందిలో పెట్టి ఇజ్జత్ తీస్తా, మాయమ్మనే బాధపెడతాడ కసాయోడు అని కోపంతో ఊగిపోతుంది.
Also Read: మాధవ మీదకి చెయ్యెత్తిన రాధ, మాధవనే తన నాయన అన్న దేవి - ఆవేదనలో సత్య
చెస్ పోటీల్లో గెలిచినందుకు మాధవ దేవికి సర్ప్రైజ్ ఇస్తాడు. గది అంతా బెలూన్స్ తో అలంకరించి కేక్ కట్ చేయిస్తాడు. ఆదిత్య రుక్మిణికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చెయ్యకుండా బాధపడ్తుంది. 'నా రాత నేను ఎట్లా రాసుకున్నా నా బిడ్డ రాత అయిన చక్కగా చేద్దామని నా పెనివిటి కాడికి పంపిద్దామని అనుకున్నా కానీ మాధవ సారు బిడ్డ మనసులో విషం నింపాడు. ఆ మాట నీకు ఎట్లా చెప్పాలి, నీ బిడ్డే నిన్ను గలిజ్ అనుకుంటుందని ఎట్లా చెప్పమంటావ్ పెనిమిటి. ఆ మాట నీకు చెప్పలేకనే ఫోన్ లిఫ్ట్ చెయ్యడం లేదు' అని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చెయ్యడం లేదు ఏం జరిగింది ఏదైనా సమస్యలో ఉందా అని ఆదిత్య ఆలోచిస్తాడు. కన్నతండ్రి గురించి దేవి అన్న మాటలు తలుచుకుని కంటికి ఏకధాటిగా ఏడుస్తుంది. గసువంటి కసాయి వాడిని నేను విడిచిపెట్టను నాయన్ని విడిచి పెట్టను అని దేవి నిద్రలో కలవరిస్తూ ఉంటుంది. అది చూసి రుక్మిణి తల్లడిల్లిపోతుంది. సత్య ఆదిత్య మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే అక్కడికి కమల వస్తుంది. మరిది గారు నిన్ను అమెరిక తీసుకెళ్తాడని నమ్మకం తనకి లేదని కమల అంటుంది. ఆదిత్య రానన్నా కానీ నేను ఎలాగైనా అమెరికా తీసుకుని వెళ్తానని అంటుంది.