అన్వేషించండి
Advertisement
MAA Elections: 'మా' సభ్యత్వానికి సీవీఎల్ రాజీనామా.. ప్రకాష్ రాజ్ కి క్షమాపణ..
సీవీఎల్ నరసింహారావు 'మా' ఎన్నికలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎలెక్షన్స్ కి ఒక్కరోజు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాయి. ఎన్నికలు జరగడానికి ఒక్కరోజే ఉన్నా.. ఇప్పటికీ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. మంచు విష్ణు, ప్రకాష్ రాజు ప్యానెల్స్ కి పోటీగా సీవీఎల్ నరసింహారావు కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ ఆయన బరి నుంచి తప్పుకున్నారు. నామినేషన్ విత్ డ్రా చేసుకున్న అనంతరం సీవీఎల్ ప్రకాష్ రాజ్ పై సంచలన ఆరోపణలు చేశారు.
మంచు విష్ణు ప్యానెల్ కి సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పారు. దివంగత దాసరి నారాయణ రావు తనకు కలలో కనిపించి చెప్పినట్లుగా చెప్పుకొచ్చారు. తాజాగా మరోసారి ఆయన 'మా' ఎన్నికలపై సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎలెక్షన్స్ కి ఒక్కరోజు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. సినీ పెద్దలైన, స్వర్గస్తులైన నాగేశ్వరరావు, దాసరి గారి ఆశీస్సులు ఉన్నాయని.. కచ్చితంగా ఈ ఎన్నికలు హాయిగా ముగుస్తాయని.. ఒకవేళ ముగియకపోతే రాజీనామా చేస్తానని అన్నారు.
ఎన్నికలు జరగాల్సి వస్తే గనుక ఓటు వేయనని.. ఈ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ ఓటేస్తే ఇలాంటి గందరగోళ, దారుణమైన పరిస్థితులకు నేను కూడా దోహదం చేసినట్లు అవుతుందని తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇలాంటి కామెంట్స్ చేసిన కాసేపటికే ఆయన 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయ్యానని.. అందుకే రాజీనా చేశానని అన్నారు. ఓటు వేయడానికి తనకు అర్హత లేదని అన్నారు. కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ ని బాధపెట్టానని ఆయనకి క్షమాపణలు చెప్పారు. 'మా' సభ్యత్వంతో పాటు బీజీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
Watch This : "నా ఓటు ఆ పానెల్ కే.." నగరి ఏమ్మెల్యే రోజా ప్రకటన
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: ‘మా’ బిడ్డల పోరు.. కళామతల్లి కన్నీరు.. పదవుల కోసం పంతాలు? పరువు తీస్తున్న పోట్లాటలు!
Also Read: పవన్‌తో విభేదాలు.. ఆయన మార్నింగ్ షో కలెక్షనంత ఉండదు మీ సినిమా: ప్రకాష్ రాజ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion