KGF 2 On Zee Telugu TV : హాట్‌స్టార్‌లో 'ది వారియర్', ఆహాలో 'పక్కా కమర్షియల్', జీ తెలుగులో 'కెజియఫ్ 2' - విడుదల ఎప్పుడంటే?
Latest Movies Ready For OTT Release : అతి త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రామ్ 'ది వారియర్', ఆహాలో గోపీచంద్ 'పక్కా కమర్షియల్', జీ తెలుగు టీవీలో పాన్ ఇండియా స్టార్ యశ్ 'కెజియఫ్ 2' విడుదల కానున్నాయి.
డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో కొత్త సినిమా విడుదల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు, టీవీ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్. ఆగస్టులో పలు కొత్త సినిమాలు ఓటీటీ వేదికల్లో సందడి చేయనున్నాయి. అందులో రామ్ రీసెంట్ సినిమా 'ది వారియర్', పాన్ ఇండియా స్టార్ యశ్ నటించిన 'కెజియఫ్ 2', గోపిచంద్ 'పక్కా కమర్షియల్' సినిమాలు ఉన్నాయి.
అతి త్వరలో జీ తెలుగులో 'కెజియఫ్ 2'
'కెజియఫ్' సినిమాతో కన్నడ హీరో యశ్ (Yash) పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన సినిమా 'కెజియఫ్ 2' (KGF 2 Movie). త్వరలో ఈ సినిమా జీ తెలుగు టీవీ ఛానల్‌లో టెలికాస్ట్ కానుంది. ఈ విషయం తెలియజేస్తూ లేటెస్టుగా ఒక ప్రోమో విడుదల చేశారు. (KGF Chapter 2 World Television Premiere On Zee Telugu)
ఆగస్టు 11న హాట్‌స్టార్‌లో 'ది వారియర్'
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన సినిమా 'ది వారియర్'. ఇందులో ముందు డాక్టర్‌గా, ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్‌గా డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. కృతి శెట్టి కథానాయికగా నటించారు. లింగుస్వామి దర్శకత్వంలో భారీ ఖర్చుతో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన 'ది వారియర్' ఆగస్టు 11న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో (The Warriorr Movie OTT Release Date) విడుదల కానుంది. ఒక డాక్టర్ ఎందుకు పోలీస్ అయ్యాడు? అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. నటుడిగా రామ్ పోతినేనికి మంచి పేరు తెచ్చిన చిత్రమిది.
Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు
ఆగస్టు 5న ఆహాలో 'పక్కా కమర్షియల్'
మ్యాచో స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'బన్నీ' వాసు నిర్మించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. ఈ సినిమా ఆగస్టు 5న ఆహా ఓటీటీలో విడుదల కానుంది. ఎవరి వల్ల అయితే తండ్రి న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి కిరాణా కొట్టు పెట్టుకోవాల్సి వచ్చిందో? ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తిని కొడుకు ఎలా కోర్టుకు పట్టించాడు? అనేది 'పక్కా కమర్షియల్' కాన్సెప్ట్. (Pakka Commercial Movie OTT Release Date)
Also Read : కమెడియన్ చేత అమ్మాయికి తాళి కట్టించిన సుమ - తర్వాత యూట్యూబ్‌లో వీడియో డిలీట్