Anchor Suma : కమెడియన్ చేత అమ్మాయికి తాళి కట్టించిన సుమ - తర్వాత యూట్యూబ్‌లో వీడియో డిలీట్
'క్యాష్' ప్రోగ్రామ్‌లో చాలా స్కిట్స్ చేస్తుంటారు. బట్, ఫర్ ఎ చేంజ్ స్కిట్ కాదు... ఈ సారి పెళ్లి చేశారు. అదీ రియల్ లైఫ్ లవర్స్‌కు పెళ్లి చేయడం విశేషం.
సుమ కనకాల (Suma Kanakala) అంటే 'క్యాష్'... 'క్యాష్' ప్రోగ్రామ్ అంటే సుమ కనకాల. ఆవిడ ఇతర ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నా... ఇంటర్వ్యూలు చేస్తున్నా... 'క్యాష్'కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ప్రోగ్రామ్‌లో సుమ కనకాల స్పాంటేనియస్ పంచ్ డైలాగులకు చాలా మంది అభిమానులు ఉన్నారు. 'క్యాష్'లో స్పెషల్ స్కిట్స్ గట్రా చేస్తుంటారు. బట్, ఫర్ ఎ చేంజ్... ఈసారి పెళ్లి చేశారు. అదీ రియల్ లైఫ్‌లో లవర్స్ అయినటువంటి రీల్ లైఫ్ యాక్టర్స్‌కు!
ప్రేమలో నూకరాజు - ఆసియా
'జబర్దస్త్' కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన యంగ్ కమెడియన్ నూకరాజు (Jabardasth Nookaraju). అతను 'పటాస్' చేశారు. ఇప్పుడు 'జబర్దస్త్'లో ఎక్కువ కనిపించడం లేదు. 'జాతి రత్నాలు' స్టాండప్ కామెడీ షో చేస్తున్నాడు. 'పటాస్'లో ఆసియా (Pataas Asia) తో నూకరాజు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇద్దరూ లవర్స్ అనేది ప్రేక్షకులకూ తెలుసు.
ఆగస్టు తొలి వారంలో టెలికాస్ట్ కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు 'జబర్దస్త్' కమెడియన్స్ వచ్చారు. అందులో నూకరాజు - ఆసియా జోడీ కూడా ఉంది. 'నీది నిజమైన ప్రేమ అయితే వెలిగించుకో... ఇది హారతి కర్పూరం. చేతిలో పెట్టుకో' అని సుమ అగ్గిపెట్టి, కర్పూరం ఇచ్చారు. నిజంగా అర చేతిలో హారతి కర్పూరాన్ని పెట్టుకుని నూకరాజు వెలిగించుకున్నాడు. వద్దంటూ పక్కన ఆసియా ఎమోషనల్ అయ్యారు.
ఆసియాకు 'క్యాష్'లో తాళి కట్టిన నూకరాజు?
ఆ తర్వాత 'మా అందరి సాక్షిగా ఆసియాకు తాళి కట్టు' అని తాళిబొట్టు ఇచ్చారు సుమ. తాళి అందుకున్న నూకరాజు కట్టినట్టు చూపించలేదు కానీ... కట్టడానికి ఆసియా దగ్గరకు వెళ్లడంతో ప్రోమోకి ఎండ్ కార్డు వేశారు. నిజంగా తాళి కట్టాడా? లేదా? అనేది ఆగస్టు 6న చూడాలి.
Also Read : 'జబర్దస్త్'కు ఎక్స్ట్రా గ్లామర్, అనసూయ ప్లేస్‌లో వచ్చిన కొత్త యాంకర్ ఎవరో తెలుసా?
'క్యాష్' సెట్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఆసియాను ఎత్తుకుని నూకరాజు డ్యాన్స్ చేశాడు. అప్పుడు 'పెళ్ళాం కదా' అని అన్నాడు. సో... తాళి కట్టడానికి అతడు వెనకడుగు వేయడని అనుకోవచ్చు. కొంత సేపటి తర్వాత ఈ వీడియో డిలీట్ చేయడం గమనార్హం. ఎందుకు డిలీట్ చేశారో? కొత్త ప్రోమో విడుదల అయితే... అందులో నూకరాజు, ఆసియా తాళి కట్టే విజువల్స్ ఉంటాయో? లేదో? తెలుస్తుంది. 'జబర్దస్ట్' ప్రవీణ్ - ఫైమా మధ్య కూడా ప్రేమ ఉందని ఆ ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.
Also Read : నాలుగు ఎముకలు దొరికితే చాలు, డెడ్ బాడీ జాతకం చెబుతానంటున్న అమలా పాల్