అన్వేషించండి

New Year 2025: సూపర్ స్టార్, ఐకాన్ స్టార్‌తో పాటు అఖిల్ కూడా... 2025లో వీళ్ళ సినిమాలు వచ్చే ఛాన్స్‌ లేదు

ఏడాది ఆఖరికి వచ్చేసింది. స్టార్ హీరోల సందడితో బాక్సాఫీస్ కళకళలాడింది. కొత్త ఏడాదిలో వచ్చే సినిమాలేవో ఫ్యాన్స్ చేస్తున్నారు. అయితే... 2025లో సినిమాలు రిలీజ్ చేయలేని స్టార్స్ ఎవరో తెలుసా?

కొత్త ఏడాది వస్తుందంటేనే తమ అభిమాన హీరోల సినిమాలు ఆ సంవత్సరంలో ఏమేం రిలీజ్ అవుతాయనే ఇంట్రెస్ట్ ఫ్యాన్స్ కు ఉంటుంది. ఒకప్పుడు అంటే పదికి తగ్గకుండా ఒక్కో స్టార్ హీరో సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులు, బడ్జెట్ల దృష్ట్యా ఏడాదికి ఒక్క సినిమా అయినా స్టార్ హీరోల నుండి వస్తుందా? లేదా? అన్న డౌట్ ఫ్యాన్సులోనూ, ఆడియన్సులోనూ ఉండడం సహజమైపోయింది. 2025లో తెలుగులోని దాదాపు అందరు స్టార్ల నుంచి సినిమాలు వస్తున్నాయి. కానీ, ఇద్దరు బడా స్టార్లు, ఒక యంగ్ హీరో మాత్రం వచ్చే ఏడాదిలో ఎటువంటి సినిమాను రిలీజ్ చేయడం లేదు.

2025లో సినిమా రిలీజ్ లేని స్టార్స్ వీరే
టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్లు 2025కు తమ సినిమాలను రెడీ చేస్తుంటే కొత్త ఏడాదిలో ఒక్క సినిమానూ రిలీజ్ చేయని స్టార్స్ ముగ్గురే కనబడుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ మహేష్ బాబు - రాజమౌళి సినిమానే (SSMB29). ఇంకా షూటింగే ప్రారంభించని ఈ సినిమా 2025లో రావడం అసాధ్యం. అమెజాన్ అడవుల నుండి ప్రపంచంలో పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకునే ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం రెండు ఏళ్ళు పడుతుందని అంచనా.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్: 'పుష్ప 2'తో 2024కు అదిరిపోయే హిట్టుతో గుడ్ బై చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుండి 2025లో కొత్త సినిమా రిలీజ్ కావడం కష్టం. తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Allu Arjun Next Movie After Pushpa 2)తో ఉంటుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఆ తర్వాత షూటింగ్ ప్రారంభమై అది పూర్తి కావడానికి ఈజీగా ఏడాది టైం పడుతుంది. అందువల్ల 2025లో అల్లు అర్జున్ నుండి కొత్త సినిమా రావడం అసాధ్యమే.

అఖిల్ కొత్త సినిమా కబురే లేదు: 2023లో వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్ 2024లో ఎలాంటి సినిమా రిలీజ్ చేయలేదు. వచ్చే ఏడాదిలోనూ ఆయన నుండి సినిమా రావడం కష్టమే. అసలు ఆయన కొత్త సినిమా కబురు ఏదీ చెప్పలేదు. ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న ఆయన పెళ్లి పనులు ముగించుకున్న తర్వాతే  కొత్త సినిమాని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2025లో యంగ్ స్టార్ అక్కినేని అఖిల్ నుండి కొత్త సినిమా రిలీజ్ కావడం సాధ్యపడకపోవచ్చు.

వయసుతో సంబంధం లేదంటున్న స్టార్ హీరోలు
సీనియర్ స్టార్ హీరోలు నలుగురూ 2025లో థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'తో ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో వస్తున్నారు. వరుస / హిట్లతో జోరు మీదున్న నట సింహం బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో సంక్రాంతికి, విజయ దశమికి 'అఖండ 2 తాండవం' విడుదలకు రెడీ అయ్యారు. కింగ్ నాగార్జున 'కుబేర', 'కూలీ' సినిమాలతో జోరు మీద ఉన్నారు. సంక్రాంతికి విక్టరీ వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో వస్తున్నారు. గత 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీని తమ భుజాల మీద మోస్తున్న ఈ నలుగురు స్టార్స్ యంగ్ జనరేషన్‌తో సైతం పోటీపడుతూ ఇండస్ట్రీ జనాలకు పని కల్పిస్తున్నారు.

Also Read: దటీజ్ పవన్ కళ్యాణ్... ఈ ఏడాది గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ లిస్టులో ఒకే ఒక్క టాలీవుడ్ స్టార్

సత్తా చూపుతామంటున్న యంగ్ స్టార్స్...  పాన్ ఇండియా సినిమాలతో 
మెగా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'గేమ్ చేంజర్'. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'సలార్', 'కల్కి 2898 ఏడీ'లతో సూపర్ హిట్స్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీ జోనర్ లో చేస్తున్న 'రాజా సాబ్ ' తో 2025 లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'దేవర'తో హిట్టు కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త ఏడాదిలో పాన్ ఇండియన్ మూవీ 'వార్ 2'తో వస్తున్నారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయిన పవర్ స్టార్ నుండి 2025లో ఏకంగా రెండు సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ఎప్పట్నుంచో పెండింగ్లో ఉన్న 'హరిహర వీరమల్లు'తో పాటు పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'ఓజీ' రిలీజ్ కూడా 2025లోనే ఉండబోతోంది. నేచురల్ స్టార్ నాని కొత్త ఏడాదిలో 'HIT 3 third case'ను రిలీజ్ కు రెడీ చేస్తుంటే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇంకా పేరు పెట్టని 'VD 12'తో రాబోతున్నారు. ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన 'తండేల్' సినిమాతో నాగచైతన్య వస్తుంటే... వరుస హిట్లతో జోరు మీదున్న సిద్దు జొన్నలగడ్డ 'తెలుసు కదా' సినిమాతో 2025లో నేను సైతం రెడీ అంటున్నారు. 'హను మాన్'తో 2024కు తొలి సూపర్ హిట్ ఇచ్చిన తేజా సజ్జా 'మిరాయ్' సినిమాతో మళ్ళీ పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు.

Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Tripti Dimri : ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Embed widget