అన్వేషించండి

Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..

Mohan Babu News Updates | జల్‌పల్లిలోని తన ఫాం హౌస్ వద్ద మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేశారు. ఆ జర్నలిస్టుకు డాక్టర్లు బుధవారం నాడు సర్జరీ చేశారు. 3, 4 రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు.

Journalist Injured in Mohan Babu Attack at His home: హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో గాయపడిన జర్నలిస్టుకు వైద్యులు సర్జరీ చేశారు. జర్నలిస్ట్ రంజిత్‌కు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్లు సర్జరీ పూర్తి చేశారు. రెండు, మూడుచోట్ల ఫ్రాక్చర్ అయిన జైగోమాటిక్ ఎముకకు వైద్యులు సర్జరీ చేశారు. మరో మూడు, నాలుగు రోజులు ఆ జర్నలిస్టును అబ్వరేషన్‌లో ఉంచాలని వైద్యులు తెలిపారు. జర్నలిస్టుకు మెదడు, తలలో అంతర్గతంగా ఏమైనా డ్యామేజీ జరిగిందా అని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఏమైనా సమస్య తలెత్తుతుందా అని టెన్షన్ పడుతున్నారని సమాచారం. 

న్యూస్ కవరేజ్ కోసం జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసానికి మంగళవారం సాయంత్రం వెళ్లిన సమయంలో మీడియా ప్రతినిధి రంజిత్‌పై నటుడు ఒక్కసారిగా దాడి చేయడం కలకలం రేపింది. నమస్తే అంటూ జర్నలిస్ట్ వద్దకు వచ్చిన మోహన్ బాబు ఒక్కసారిగా రంజిత్ చేతిలో ఉన్న న్యూస్ కవర్ చేస్తున్న మైకును లాక్కున్నారు. అంతటితో ఆగకుండా తీవ్ర ఆవేశంతో జర్నలిస్టు తలపై కొట్టడంతో అంతర్గతంగా గాయాలయ్యాయి. చికిత్స కోసం జర్నలిస్టును హాస్పిటల్ తరలించగా పరీక్షించిన డాక్టర్లు ఆయనకు జైగోమాటిక్ బోన్ ఫ్యాక్చర్ అయినట్టుగా నిర్ధారించారు. సర్జరీ సైతం చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు డాక్టర్లు ఆ జర్నలిస్టుకు సర్జరీ చేసి బోన్ ఫ్రాక్చర్ సరిచేశారు. అయితే మూడు, నాలుగు రోజులు వైద్య పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుందని, కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు.

Also Read: Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట 

మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు చేసిన దాడిని జర్నలిస్టు సంఘాలతో పాటు పలు సొసైటీలు, నేతలు సైతం తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం నిరంతరం వార్తలు చేరువ చేసే వారిపై దాడులకు దిగడం హేయమైన చర్య అని విమర్శిస్తున్నారు. జర్నలిస్టులకు మోహన్ బాబు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వయసులో అంత పెద్ద వ్యక్తి, సుదీర్ఘమైన అనుభవం ఉన్న మోహన్ బాబు ఆవేశానికి లోనై జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించి, దాడులు చేయడం సమంజసమేనా అని ప్రశ్నిస్తున్నారు. 

తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబుకు ఊరట

మరోవైపు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై డిసెంబర్ 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. మోహన్ బాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం విచారించిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.  మోహన్ బాబు ప్రస్తుతం గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసిందే. నిన్న జల్‌పల్లిలోని ఆయన ఫాం హౌస్ వద్ద జరిగిన ఘటనలో ఆయనకు కంటి కింద స్వల్ప గాయం కాగా, మరోవైపు హై బీపీతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రెండు రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాలని, అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు ప్రకటించారు. మంచు వివాదంలో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్‌లకు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీపీ కార్యాలయంలో హాజరైన మనోజ్ శాంతిభద్రతల సమస్య సృష్టించబోనని రూ.1 లక్ష రూపాయలకు బాండ్ ఇచ్చారు. పోలీసుల ఎదుట తాను హాజరు కావాల్సిన అవసరం లేదని మంచు విష్ణు పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Prithviraj Sukumaran: 'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
'తెలుగులో చాలా పెద్ద డైలాగ్ వచ్చు' - ఆ సినిమా గురించి మాట్లాడనన్న పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 గురించేనా..!
Costly Palace: అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
అంబానీల ఆంటిలియా కంటే ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న మహిళ - భవనం ప్రత్యేకతలు బోలెడు
Embed widget