News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Ram On Secret Lover Rumours: ఇంట్లోనూ డౌట్ డౌట్‌గా చూశారు, ఫ్రెండ్స్ ఫోన్స్ చేశారు - సీక్రెట్ లవర్ రూమర్స్‌పై రామ్

స్కూల్‌లో తనతో పాటు చదివిన అమ్మాయితో రామ్ ప్రేమలో పడ్డారని, ఆమెను పెళ్లి చేసుకోకున్నారని వచ్చిన రూమర్స్ మీద రామ్ స్పందించారు. ట్వీట్ చేశారు. అలా ఎందుకు స్పందించాల్సి వచ్చిందో రామ్ చెప్పారు. 

FOLLOW US: 
Share:

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni)... తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరు. తమిళంలోనూ, హిందీలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన అంటే చాలా మంది అమ్మాయిలకు ఇష్టం. అయితే... రామ్ ఎవరిని ఇష్టపడుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే... ఆయన ఎప్పుడూ ప్రేమలో పడలేదు కాబట్టి!

రామ్ ప్రేమలో ఉన్నానని చెప్పలేదు కానీ... స్కూల్‌లో తనతో పాటు చదివిన అమ్మాయితో పడ్డారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే కొంత మంది గాసిప్ రాయుళ్లు రాసుకొచ్చారు. తాను స్కూల్‌కు ఎప్పుడు వెళ్లానని రామ్ ట్వీట్ చేశారు. గురువారం 'ది వారియర్' సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో మాట్లాడిన రామ్... సీక్రెట్ చైల్డ్‌హుడ్‌ గాళ్ ఫ్రెండ్ రూమర్ మీద ఎందుకు స్పందించాననేది చెప్పారు.
 
లవ్ అంటూ వచ్చిన రూమర్స్ గురించి రామ్ మాట్లాడుతూ ''సాధారణంగా నేను గాసిప్స్ గురించి మాట్లాడను. నాతో కూడా ఎవరూ మాట్లాడరు. సీక్రెట్ చైల్డ్‌హుడ్‌ గాళ్ ఫ్రెండ్ అని రాశారు. ఇంట్లో వాళ్ళు డౌట్ డౌట్‌గా చూడటం మొదలుపెట్టారు. నా స్నేహితులు కూడా నెమ్మదిగా 'మాకే తెలియకుండా ఏంటిది?' అని ఫోన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అసలు, 'ఏం లేకుండా రాస్తారంటావా?' అనే క్వశ్చన్ వచ్చింది. అందుకని, రియాక్ట్ అవ్వక తప్పలేదు. జెన్యూన్‌గా అడిగా... నేను స్కూల్‌కి ఎప్పుడు వెళ్లానని!'' అని అన్నారు. ఒకవేళ నిజంగా అమ్మాయి ఉంటే స్కూల్‌కి వెళ్లేవాడని తమ ఇంట్లో అనుకున్నారని ఆయన పేర్కొన్నారు. 

పెళ్లి గురించి కూడా రామ్ స్పందించారు. ప్రేమ పుకారు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఈ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పడుతుందని ఎప్పుడైనా అనిపించిందా?  పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి పెరిగిందా? అని ప్రశ్నించగా... ''అటువంటిది ఏమీ లేదు. పదిసార్లు అడిగితే పెళ్లి చేసుకుంటామా?'' అని రామ్ నవ్వేశారు. సో... రామ్ జీవితంలో లవర్ ఎవరూ లేరని అనుకోవాలి. ఇప్పట్లో ఆయన పెళ్లి లేనట్టే!

Also Read : పెళ్లి పెళ్లే... సినిమాలు సినిమాలే! 75వ సినిమాకు నయనతార రెడీ

'ది వారియర్' విడుదలైన తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోయే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రామ్ రెడీ అవుతున్నారు. కరోనా వల్ల బ్రేక్ రావడంతో ఈసారి సినిమా విడుదల తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయడానికి బ్రేక్ తీసుకోకూడదని అనుకుంటున్నారు. 

Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Published at : 12 Jul 2022 03:44 PM (IST) Tags: ram The Warriorr Movie Ram On Love Life Who Ram Is Secret Girlfriend Ram On Love Rumours

ఇవి కూడా చూడండి

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

Ram Charan Ted Sarandos : మెగాస్టార్ ఇంటికి నెట్‌ఫ్లిక్స్ సీఈవో - రామ్ చరణ్‌తో దోస్తీ భేటీ

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘హాయ్ నాన్న’ రివ్యూ, ‘యానిమల్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమాలో తెలుగమ్మాయికి ఛాన్స్

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Devil: థియేటర్లలోకి 'డెవిల్' వచ్చేది ఆ రోజే - కళ్యాణ్ రామ్ ఇయర్ ఎండ్ కిక్!

Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?

Abhiram Daggubati Marriage : ఓ ఇంటివాడైన దగ్గుబాటి వారసుడు - అభిరామ్ పెళ్లి ఫోటోలు చూశారా?

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?

Telangana Cabinet :  హోంమంత్రిగా ఉత్తమ్  - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?