By: ABP Desam | Updated at : 12 Jul 2022 04:16 PM (IST)
పెళ్లి దుస్తుల్లో నయనతార
ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక ఇంటి కోడలు. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ భార్య. కుమారిగా ఉన్నప్పుడు సినిమాలు చేశారు. ఏడు అడుగులు వేయడానికి ముందు ఏడు పదులకు పైగా చిత్రాల్లో నటించారు. శ్రీమతి అయిన తర్వాత నటనకు ఫుల్ స్టాప్ పెడతారా? చాలా మంది మదిలో మొదలైన ప్రశ్న ఇది. నటనకు ఫుల్ స్టాప్ పెట్టి నిర్మాతగా మాత్రమే కంటిన్యూ అవుతారని కూడా చెన్నై సినీ వర్గాల్లో వినిపించింది. ఒక్క ప్రకటనతో వాటన్నిటికీ చెక్ పడింది.
నయనతార ప్రధాన పాత్రలో ట్రైడెంట్ ఆర్ట్స్ ఆర్. రవీంద్రన్ సమర్పణలో జీ స్టూడియోస్, నాడ్ స్టూడియోస్ ఒక సినిమా నిర్మించనుంది. ఇందులో సత్యరాజ్, జై ఇతర ప్రధాన తారాగణం. నీలేష్ కృష్ణ రచన, దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా నయనతారకు 75వ సినిమా. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాణ సంస్థలు పేర్కొన్నాయి. నేడు అధికారికంగా సినిమా వివరాలు ప్రకటించారు.
అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే... నయనతార పెళ్లి తర్వాత వచ్చిన కొత్త సినిమా ప్రకటన ఇది. దీంతో పెళ్లి తర్వాత నయనతార నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదని, సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారని క్లారిటీ వచ్చింది. సో... నయన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ఇది. పెళ్లి తర్వాత ముంబైలో షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా షూటింగులో నయనతార జాయిన్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు అంగీకరించిన సినిమా అది.
Also Read : ఆ రూమర్ నిజమే అంటున్న రష్మిక, అతడితో...
పెళ్లి తర్వాత నటించకూడదని రూలేమీ లేదు. హిందీలో చాలా మంది హీరోయిన్లు వివాహమైన తర్వాత సినిమాల్లో నటిస్తూ... ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పెళ్లి తర్వాత మహిళలకు ఇళ్లకు పరిమితం కావాల్సిన పని లేదని, ఉద్యోగాలుచేయవచ్చని పరోక్షంగా సందేశం ఇస్తున్నారు. అటువంటి కథానాయికల జాబితాలో నయనతార కూడా చేరారు. అదీ సంగతి!
Also Read : పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు - యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై విక్రమ్ రియాక్షన్
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Dirty Picture Sequel: విద్యా బాలన్ 'డర్టీ పిక్చర్'కు సీక్వల్, ఆ పాత్ర చేసేందుకు కంగనా తిరస్కరణ?
Chiranjeevi Birthday Special: 30 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘ఘరానా మొగుడు’
The Ghost Promo: ‘ది ఘోస్ట్’ ప్రోమో: ‘థమహగానే’ సీన్తో నాగ్ ఎంట్రీ - అంచనాలు పెంచేస్తున్న కింగ్ మూవీ!
ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
Koppula Eashwar: సుప్రీంకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్కి చుక్కెదురు, 2018 నాటి కేసులో కీలక మలుపు