Vikram: పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు - యూట్యూబ్ థంబ్‌నైల్స్‌పై విక్రమ్ రియాక్షన్
చెన్నైలో సోమవారం రాత్రి జరిగిన 'కోబ్రా' ఆడియో విడుదల కార్యక్రమానికి విక్రమ్ అటెండ్ అయ్యారు. తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లపై స్పందించారు.
Chiyaan Vikram Is Back and Looks Healthy: చియాన్ విక్రమ్‌కు ఎలా ఉంది? ఆయన ఆరోగ్యం కుదుట పడిందా? లేదా? ఈ ప్రశ్నలకు సోమవారం రాత్రి సమాధానం లభించింది. విక్రమ్ చాలా ఆరోగ్యంగా, ఫిట్‌గా కనిపించారు. తన హెల్త్ మీద వచ్చిన పుకార్లపై స్పందించారు కూడా!
విక్రమ్ కథానాయకుడిగా నటించిన 'కోబ్రా' ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో సోమవారం రాత్రి జరిగింది. దానికి హాజరైన విక్రమ్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని అభిమానులకు చెప్పారు. ''నా ఆరోగ్యం గురించి చాలా రాశారు. ఏవేవో ప్రచారం చేశారు. నేను కొన్ని యూట్యూబ్ థంబ్‌నైల్స్ చూశా. ఎవరో పేషెంట్ బాడీకి నా ఫేస్ అతికించారు. మార్ఫింగ్ చేసి క్రియేటివిటీ చూపించారు. కానీ, నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను'' అని విక్రమ్ పేర్కొన్నారు.
'కోబ్రా' ఆడియో వేడుకలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్, విక్రమ్ ప్రజెన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
గత శుక్రవారం ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో విక్రమ్ అడ్మిట్ అయ్యారు. ఆయనకు గుండెనొప్పి వచ్చిందని ప్రచారం జరగ్గా... ధృవ్ విక్రమ్, మేనేజర్ ఖండించారు. ఇప్పుడు విక్రమ్ కూడా స్పందించారు. అదీ సంగతి!
Also Read : 'ఆర్ఆర్ఆర్' సినిమాపై పోర్న్ స్టార్ ట్వీట్ - సోషల్ మీడియాలో హాట్ టాపిక్
#ChiyaanVikram about the rumours about him..😅#CobraAudioLaunch #Cobrapic.twitter.com/7GQ08WD5Ry
— Laxmi Kanth (@iammoviebuff007) July 11, 2022
సినిమాలకు వస్తే... 'కోబ్రా' సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో 'కెజియఫ్' (KGF 2) ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్. మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో విక్రమ్ చోళరాజు ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ నటించారు. ఆ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : రామ్ 'వారియర్' to సాయి పల్లవి 'గార్గి' - థియేటర్లు, ఓటీటీల్లో ఈ వారం విడుదలవుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు
View this post on Instagram