Ram Gopal Varma Vyooham Movie: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
![Ram Gopal Varma Vyooham Movie: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు Vyooham Movie News High Court canceled the vyooham film censor certificate Ram Gopal Varma Vyooham Movie: వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు- తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/22/cbe1d3f969797908be0904ea8e68ec2b1705902076283252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ram Gopal Varma Vyooham Movie: వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఇప్పటికే ఆ సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసింది. సినిమాను మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మూడు వారాల్లోగా రివ్యూ కమిటీ నివేదికను హైకోర్టుకు సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీసేలా ‘వ్యూహం’ సినిమా తెరకెక్కించారని ఆరోపిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాల్ చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుందని అనుకుంటే, తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని నిర్మాత తరఫు లాయర్ కోరారు. దీనిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)