(Source: ECI/ABP News/ABP Majha)
Vivek Agnihotri: ‘పుష్ప’, ‘కాంతార’పై ఆ వ్యాఖ్యలు తగవు - అనురాగ్ కామెంట్స్‌పై వివేక్ అగ్నిహోత్రి ఫైర్!
‘కాంతార’ లాంటి సినిమాలు బాలీవుడ్ ను నాశనం చేస్తున్నాయంటూ దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన వ్యాఖ్యలను మరో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా అనురాగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలు సత్తా చాటుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కి అద్భుత విజయాలను అందుకుంటున్నాయి. ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘ఆర్ఆర్ఆర్’ బ్లాక్ బస్టర్ సాధించాయి. తాజాగా ‘కాంతార’ కూడా ఇదే లిస్టులో చేరింది. సౌత్ దర్శకులు, నటీనటలు ప్రతిభను చాలా మంది మూవీ మేకర్స్ మెచ్చుకుంటున్నారు. అద్భుత పనితీరు కనబర్చారంటూ ప్రశంసిస్తున్నారు. కానీ, కొంత మంది మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘కాంతార’ లాంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయని పేర్కొన్నాడు.
పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కు ముప్పు-అనురాగ్
‘సైరత్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా మరాఠీ ఇండస్ట్రీని కొలాప్స్ చేసిందని దర్శకుడు నాగరాజు మంజులే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ను అనురాగ్ కశ్యప్ కోట్ చేస్తూ.. ‘కాంతార’ విషయాన్ని ప్రస్తావించారు. ‘కాంతార’ లాంటి సినిమాల కారణంగా ఇండస్ట్రీ నాశనం అవుతుందన్నారు. ఇలాంటి సినిమాలు విజయం సాధించడం వల్ల బాలీవుడ్ కుదేలవుతోందన్నాడు. పాన్ ఇండియా సినిమాలతోనే బాలీవుడ్ కు అసలు ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డాడు. పాన్ ఇండియా సినిమాలతో దర్శక నిర్మాతలు కొత్త ట్రెండ్ ను కొనసాగిస్తున్నారని చెప్పాడు. దీని వల్లే బాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్నాడు. కొన్ని సినిమాలు దేశ వ్యాప్తంగా సక్సెస్ అయినా, వాటిని కాపీ చేసి పాన్ ఇండియా సినిమాలు తీస్తే బాలీవుడ్ కు దెబ్బ తప్పదన్నాడు. ఇండస్ట్రీ బాగుపడాలంటే కథల్లో కొత్తదనం ఉండకతప్పదన్నాడు.
Anurag Kashyap about his view on @PushpaMovie & #Kantara #AlluArjun #Pushpa2 #PanIndia Movies
— Murali Manohar (@Murali91Manohar) December 13, 2022
#PushpaTheRule pic.twitter.com/tdNaC6rRsK
అనురాగ్ వ్యాఖ్యలు తప్పుబట్టిన వివేక్ అగ్నిహోత్రి
అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలను ‘కాశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తప్పుబట్టారు. అనురాగ్ ను 'బాలీవుడ్ మిలార్డ్'గా సంబోధిస్తూ ఆయన వ్యాఖ్యలతో తాను ఏమాత్రం ఏకీభవించనని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “బాలీవుడ్ వన్ అండ్ ఓన్లీ మిలార్డ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా పూర్తిగా ఏకీభవించను. మీరు అంగీకరిస్తారా?” అంటూ కామెంట్ చేశారు.
I totally totally totally disagree with the views of Bollywood’s one & only Milord.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) December 13, 2022
Do you agree? pic.twitter.com/oDdAsV8xnx
అనురాగ్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కు ప్రమాదమన్న అనురాగ్ వ్యాఖ్యలను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. గొప్ప సినిమాలు చేయడం చేతగాక, చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.
And Anurag Kashyap raised the bar of Bollywood by giving classic movies like Bombay Velvet & Dobara 🤣🤣 pic.twitter.com/OVrE9aKiCT
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) December 12, 2022
Anurag Kashyap ke hisaab se films like Kantara, Pushpa are destroying the industry and film like Pathaan is empowering and universe shattering 😁 pic.twitter.com/30ObOqKw33
— Stranger (@amarDgreat) December 13, 2022
Films like lust stories and Bombay velvet are uplifting the industry right @anuragkashyap72 ?
— Shubham Prajapati (@Ram_Bhakt_s) December 13, 2022
South movies are destroying the career of people like you#BoycottBollywood #AnuragKashyap pic.twitter.com/kn1skuQev3
Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి