అన్వేషించండి

Vishwambhara: యాక్షన్ మోడ్‌లో చిరంజీవి - 'విశ్వంభర' లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

Chiranjeevi's Vishwambhara shooting update: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'. లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఏమిటంటే?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'విశ్వంభర' (Vishwambhara Movie). సోషియో ఫాంటసీ అడ్వెంచర్ ఇది. దీనికి వశిష్ఠ మల్లిడి దర్శకుడు. బ్లాక్ బస్టర్ 'బింబిసార' తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...

లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్...
యాక్షన్ షెడ్యూల్ షురూ!
Chiranjeevi is gearing up for action in the upcoming socio fantasy movie Vishwambha: చిరంజీవి ఇమేజ్, ఆయన మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని 'విశ్వంభర'లో దర్శకుడు వశిష్ఠ లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్ క్రియేట్ చేశారని చిత్ర బృందం తెలియజేసింది. ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. 

ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు కొంత మంది ఫైటర్లు పాల్గొనగా... రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ నేతృత్వంలో కీలక యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. అది భారీ ఎత్తున! సినిమాలో ఈ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్ స్పెషల్ హైలైట్ కానుందని నిర్మాతలు తెలిపారు. అదీ సినిమాలోని కీలక సందర్భంలో వస్తుందట.

Also Read: బాలయ్య టైటిల్‌తో శర్వానంద్ సినిమా - హీరోయిన్లు ఇద్దరిలో ఒకరికి వరుస హిట్లు, ఇంకొకరికి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు

హైదరాబాద్ సిటీలో కొన్ని రోజుల క్రితం 'విశ్వంభర' షెడ్యూల్ ఒకరి జరిగింది. అందులో చిరు, త్రిష మీద పాటతో పాటు ఒక యాక్షన్ బ్లాక్, కొంత టాకీ పూర్తి చేశారు. ఈ సినిమాలో మొత్తం 18 సెట్స్ వేశారని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు నిర్మాతలు తెలిపారు.

Also Readఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?


చిరంజీవికి జోడీగా త్రిష...
'విశ్వంభర'లో చిరంజీవి సరసన సౌత్ క్వీన్ త్రిష నటిస్తున్నారు. సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్. 'స్టాలిన్' విడుదలైన 18 ఏళ్లకు మళ్లీ ఈ జోడీ సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని టాక్. వాళ్లను పక్కన పెడితే... చిరు చెల్లెళ్లుగా శర్వానంద్ 'ఎక్స్‌ ప్రెస్ రాజా', ధనుష్ 'రఘువరన్ బీటెక్', నాని 'జెంటిల్ మన్' ఫేమ్ సురభితో పాటు ఇషా చావ్లా, రమ్య పసుపులేటి నటిస్తున్నారని తెలిసింది. చిరుకు ఐదుగురు సిస్టర్స్ ఉంటారట. 

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు, సంగీతం : ఎంఎం కీరవాణి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ స్కాంలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
డిజిటల్ అరెస్ట్ స్కాంలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
IRCTC Website Crashes: దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
Advertisement

వీడియోలు

Virat Kohli Tweet | India vs Australia | విరాట్ కోహ్లీ సంచలన ట్వీట్
India vs Australia ODI | Virat Records | ఆస్ట్రేలియా టూర్‌లో విరాట్ సచిన్‌ను అధిగమిస్తాడా ?
Priyank Kharge vs Nara Lokesh on Google | పెట్టుబడులపై పెద్దయుద్ధం..వైజాగ్ vs బెంగుళూరు | ABP Desam
Haryana IPS officer Puran Kumar Mystery | ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ కేసులో ట్విస్ట్ | ABP Desam
కాంట్రాక్ట్‌పై సైన్ చేయని కోహ్లీ.. ఆర్సీబీని వదిలేస్తున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ స్కాంలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
డిజిటల్ అరెస్ట్ స్కాంలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు
Konda Surekha Controversy: కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
కొండా సురేఖను మంత్రి పదవి గండం నుంచి గట్టెక్కించిన రెండు కారణాలు ఇవే !
IRCTC Website Crashes: దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
దీపావళి ఎఫెక్ట్.. IRCTC వెబ్‌సైట్, యాప్ క్రాష్.. నిలిచిపోయిన రైలు టిక్కెట్ల బుకింగ్స్
Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ
Young India Residential schools: తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
తెలంగాణలో రూ.15,600 కోట్లతో 78 యంగ్‌ ఇండియా గురుకులాలు- కేబినెట్ ఆమోదం
Telusu Kada Twitter Review - తెలుసు కదా ట్విట్టర్ రివ్యూ: ఊహించుకుంటేనే భయంగా ఉంది... సోషల్ మీడియాలో స్టార్ బాయ్ సిద్ధూ సినిమా టాకేంటి?
తెలుసు కదా ట్విట్టర్ రివ్యూ: ఊహించుకుంటేనే భయంగా ఉంది... సోషల్ మీడియాలో స్టార్ బాయ్ సిద్ధూ సినిమా టాకేంటి?
Kurnool Drone City: 2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్ గా భారత్ ను నిలిపే కర్నూలు డ్రోన్ సిటీ
2030 నాటికి గ్లోబల్ డ్రోన్ హబ్ గా భారత్ ను నిలిపే కర్నూలు డ్రోన్ సిటీ
FUNKY Release Date: విశ్వక్ సేన్ 'ఫంకీ' Vs రోషన్ 'ఛాంపియన్' - అడివి శేష్ 'డెకాయిట్' పరిస్థితి ఏంటి?
విశ్వక్ సేన్ 'ఫంకీ' Vs రోషన్ 'ఛాంపియన్' - అడివి శేష్ 'డెకాయిట్' పరిస్థితి ఏంటి?
Embed widget