Sharwanand 37th Movie: బాలయ్య టైటిల్‌తో శర్వానంద్ సినిమా - హీరోయిన్లు ఇద్దరిలో ఒకరికి హిట్లు, ఇంకొకరికి డిజాస్టర్లు
Sharwa 37 Leading Ladies List: శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో 'ఎస్' అక్షరంతో పేరు మొదలయ్యే ఇద్దరు హీరోయిన్లు సెలెక్ట్ చేశారు.
యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand) ఫుల్ బిజీ. ఇప్పుడు ఆయన చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఆయన 35వ సినిమా 'మనమే' త్వరలో విడుదలకు రెడీ అవుతోంది. అది కాకుండా 'లూజర్' వెబ్ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా, 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా (Sharwanand 37 Movie) చేయనున్నారు. అందులో ఓ సినిమాకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా టైటిల్ ఖరారు చేశారని తెలిసింది.
నారి నారి నడుమ మురారి... ఇది శర్వానంద్ సినిమా!
Sharwa 37 titled Naari Naari Naduma Murari: శర్వానంద్ కథానాయకుడిగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'నారి నారి నడుమ మురారి' టైటిల్ ఖరారు చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి.
ఎస్... ఎస్... శర్వా సరసన సంయుక్తా మీనన్ & సాక్షి వైద్య!
Samyuktha Menon and Sakshi Vaidya got chance in Sharwa 37: శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి' సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. టైటిల్ చూసిన వారు ఎవరైనా సరే ఆ విషయం చెప్పేస్తారు. అసలు సంగతి ఏమిటంటే... సంయుక్తా మీనన్, సాక్షి వైద్య ఆ అవకాశం సొంతం చేసుకున్నారు.
శర్వా పేరు 'ఎస్' అక్షరంతో మొదలు అవుతుంది. సంయుక్తా మీనన్ (Samyuktha Menon), సాక్షి వైద్య (Sakshi Vaidya)... వాళ్లిద్దరి పేర్లూ 'ఎస్'తో మొదలు కావడం గమనార్హం. ట్రిపుల్ ఆర్ తరహాలో ఇది ట్రిపుల్ ఎస్ సినిమా అన్నమాట. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంయుక్త తెలుగు సినిమాలు ఆల్మోస్ట్ హిట్. మరోవైపు సాక్షి వైద్యకు ఒక్క హిట్ కూడా లేదు. 'సామజవరగమన' తరహాలో మరోసారి వినోదాత్మక కథతో రామ్ అబ్బరాజు చేస్తున్న ఈ సినిమాతో వాళ్లిద్దరికీ మరో హిట్ కన్ఫర్మ్ అని యూనిట్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Also Read: ఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
నయా 'నారి నారి నడుమ మురారి' చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా... జ్ఞానశేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫర్. భాను బోగవరపు కథ, నందు సవిరిగాన సంభాషణలు రాస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర, నిర్మాణ సంస్థలు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ - అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైలి, నిర్మాతలు: అనిల్ సుంకర - రామబ్రహ్మం సుంకర, కథనం & దర్శకత్వం: రామ్ అబ్బరాజు.
చిత్రసీమలో మరో విషాదం...
— ABP Desam (@ABPDesam) April 2, 2024
డబ్బింగ్ రైటర్ శ్రీ రామకృష్ణ మృతి...
అంత్యక్రియలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆయన స్వస్థలం ఎక్కడ అంటే?#SreeRamakrishna #Death #Rajinikanth𓃵 #ManiRatnam #Shankarhttps://t.co/YiG7nuL5n6