Emani Srinivasa Rao: ఆస్పత్రిలో డబ్బింగ్ ఇంజనీర్, సర్జరీకి 12 లక్షలు - దాతల కోసం ఫ్యామిలీ ఎదురు చూపులు
డబ్బింగ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ రావు కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రి పాలయ్యారు. సర్జరీకి 12 లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు తెలిపారు. దాంతో దాతల కోసం కుటుంబం ఎదురు చూస్తోంది.
ఈమని శ్రీనివాస్ రావు (Emani Srinivasa Rao)... ఈ పేరు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కాదేమో!? కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆయన తెలుసు. ఆయనొక డబ్బింగ్ ఇంజనీర్. సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', మాస్ మహారాజా రవితేజ 'క్రాక్', న్యాచురల్ స్టార్ నాని 'వి', యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు' తదితర చిత్రాలకు పని చేశారు. ఇప్పుడు ఆయన ఆస్పత్రి పాలయ్యారు. సమస్య ఏమిటి? అనే పూర్తి వివరాల్లోకి వెళితే...
కిడ్నీ ఫెయిల్యూర్... ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి
Kidney Failure Treatment: ఇప్పుడు శ్రీనివాస్ రావు వయసు 53 ఏళ్లు. ఆయన కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. జూలై, 2023లో ఆయన కిడ్నీల కండిషన్ క్రిటికల్ స్టేజిలో ఉందని తెలిసింది. అప్పటి నుంచి డయాలసిస్ చేయిస్తున్నారు. అయితే, పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే మార్గమని వైద్యులు స్పష్టం చేశారు.
Renowned Dubbing engineer Emani Srinivas garu has been undergoing regular dialysis for a couple of years, and his wife Sridevi garu, has come forward to donate her kidney👏🏼🙏🏼
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) March 21, 2024
All the necessary tests are done and Surgery is being planned soon.
We are with you entirely in the… pic.twitter.com/HkWKqSGUC0
కిడ్నీ మార్పిడికి రూ. 12 లక్షలు అవసరం!శ్రీనివాస్ రావుకు ఓ భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అమ్మాయిలు కాలేజీకి వెళుతున్నారు. భార్య శ్రీదేవి గృహిణి. కిడ్నీ మార్పిడికి 12 లక్షల రూపాయలు అవసరం అని వైద్యులు చెప్పడంతో ఏమి చేయాలో కుటుంబ సభ్యులకు పాలు పోలేదు. దాంతో వైద్యానికి అవసరం అయ్యే ఖర్చుల కోసం ఆర్ధిక సాయం చేసే దాతలు ఎవరైనా ఉన్నారేమో అని ఎదురు చూస్తున్నారు. సాయం కోరుతూ చేసిన విజ్ఞప్తికి స్పందించిన కొందరు ఆరు లక్షల రూపాయలు ఇచ్చారు. మరో ఆరు లక్షలు వస్తే సర్జరీ జరుగుతుంది.
With sound engineer par excellence Mr. Emani Srinivas Rao...
— Shrikanth BHARAT (@Shri__Bharat) July 22, 2022
Thank you so much for guiding me to become better in the art of dubbing!! pic.twitter.com/FPb3zhLJpm
సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు సైతం తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఆయనకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ త్వరగా జరిగి ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా సాయం చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...