Gaami OTT Release Date: ఈ నెలలోనే 'గామి' ఓటీటీ రిలీజ్ - ZEE5లో ఎప్పట్నించి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Vishwak Sen's Gaami OTT Release Date: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ జీ 5 సొంతం చేసుకుంది. ఓటీటీలో ఎప్పుడు విడుదల కానుందో తెలుసుకోండి.
Gaami is set to release on Zee5 OTT on April 12th: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా 'గామి'. అందులో ఆయన అఘోరా క్యారెక్టర్ చేశారు. మార్చి 8న థియేటర్లలో విడుదల అయ్యింది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా 'గామి' అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన జనాలు, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి, 'గామి' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి మొదలు కానుందో తెలుసా?
ఏప్రిల్ 12 నుంచి 'జీ 5' ఓటీటీలో 'గామి' స్ట్రీమింగ్
Gaami Movie OTT Platform: 'గామి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5' సొంతం చేసుకుంది. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రాన్ని వీక్షకుల ముందుకు తీసుకు రానుంది. ఏప్రిల్ 12వ తేదీన డిజిటల్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుందీ 'గామి'.
సంక్రాంతి బ్లాక్ బస్టర్, తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించిన 'హను-మాన్'ను ఇటీవల వీక్షకులకు అందించింది 'జీ 5'. ఇదొక్కటే కాదు... పలు సూపర్ హిట్ సినిమాలు 'జీ 5'లో ఉన్నాయి. ఇప్పుడు 'గామి' యాడ్ అవుతోంది.
విశ్వక్ సేన్ సహా తెలుగమ్మాయి చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ 'గామి' సినిమాలో ప్రధాన తారాగణం. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ సంగీత దర్శకుడు, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...
అసలు 'గామి' కథ ఏమిటి?
Gaami Movie OTT Platform Release Date: శంకర్ (విశ్వక్ సేన్) అఘోరా. అతని శరీరానికి మనిషి స్పర్శ తగిలితే వింత మార్పులకు లోనవుతుంది. అసలు, ఆ సమస్యకు మూల కారణం ఏమిటి? ఎలా దాని బారిన పడ్డాడు? తన గతం ఏమిటి? అనేది శంకర్‌కి గుర్తు లేదు. మూడు పుష్కరాలకు... అంటే 36 ఏళ్లకు ఒక్కసారి హిమాలయాల్లోని ద్రోణ గిరి ప్రాంతంలో పూసే మాలి పత్రాలు అనే ప్రత్యేకమైన పువ్వుల్ని సేవిస్తే సమస్య తీరుతుందని తెలిసింది.
శంకర్ కథ పక్కన పెడితే... భారత్ - చైనా సరిహద్దుల్లో ఎప్పుడూ మనుషులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. అక్కడ నుంచి సీటీ 333 (మహ్మద్ సమద్) అనే టెస్ట్ సబ్జెక్ట్ ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అతనితో పాటు దక్షిణ భారతదేశంలో ఓ గ్రామంలోని దేవదాసి దుర్గ (అభినయ), ఆమె కుమార్తె ఉమ (హారిక)లది మరో కథ. ఈ మూడు కథలకు సంబంధం ఏమిటి? ఎలా ఒక్కటి అయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.