ఈ అందాల భామ కన్నడ హీరోయిన్. పేరు చైత్ర జె ఆచార్. ఆవిడ లేటెస్టుగా ఈ డ్రస్ వేసి ఫోటోలు తీసుకున్నారు.

చైత్ర లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తుంటే ఏదైనా బాలీవుడ్ సాంగ్, హాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ గుర్తొస్తున్నారా?

అవును.... ప్రియాంకా చోప్రా టైపులో చైత్ర జె ఆచార్ ఫోటోషూట్ చేశారు.

'రామ్ లీల' సినిమాలో ప్రియాంకా చోప్రా స్పెషల్ సాంగ్ చేశారు. ఆ లుక్ రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు చైత్ర. 

సంజయ్ లీలా భన్సాలీ సెట్స్ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేసా (అదీ నా ఊహలో) అంటూ చైత్ర ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు.

చైత్ర కన్నడ హీరోయిన్ అయినప్పటికీ... 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

'సప్త సాగరాలు దాటి - సైడ్ బి' సినిమాలో చైత్ర జె ఆచార్ ప్రాస్టిట్యూట్ రోల్ చేశారు. 

రక్షిత్ శెట్టి సరసన వేశ్య పాత్రలో చైత్ర నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.

చైత్ర జె ఆచార్ కన్నడలో వరుస సినిమాలు చేస్తున్నారు. త్వరలో తెలుగుకు వచ్చే అవకాశం ఉంది. 

కొన్నాళ్ల క్రితం చైత్ర చేసిన బికినీ ఫోటోషూట్ వైరల్ అయ్యింది. (all images courtesy: chaithra.j.achar / Instagram)