Matti Kusthi: విష్ణు విశాల్ మట్టి కుస్తీ ట్రైలర్ రిలీజ్ - మాస్ మహరాజ్ సమర్పణలో!
విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ‘మట్టి కుస్తీ’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది.
తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘గట్టా కుస్తీ’. ఈ సినిమా ‘మట్టి కుస్తీ’ పేరుతో తెలుగులోకి డబ్ అవుతుంది. దీని ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. మాస్ మహరాజ్ రవితేజ ఈ సినిమాకు రెండు భాషల్లో సమర్పకుడిగా ఉన్నారు.
ఇక ట్రైలర్‌లో చూస్తే ఒద్దికగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆంధ్రా కుర్రాడి పాత్రలో విష్ణు విశాల్ కనిపించారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కేరళలో సెటిలైన తెలుగమ్మాయిగా కనిపించింది. తన దుడుకు స్వభావంతో అక్కడ పెళ్లి కుదరకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న విష్ణు విశాల్‌కి అబద్ధం చెప్పి తనతో పెళ్లి చేస్తారు. ఆ తర్వాత కథ బాక్సింగ్ వైపు టర్న్ తీసుకుంటుంది. ప్రతి నాయకుడి పాత్రలో శత్రు కనిపించారు.
డిసెంబర్ 2వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. వీవీ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చెల్లా అయ్యావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డియర్ కామ్రేడ్, రాధే శ్యామ్ లాంటి సినిమాలకు సంగీతాన్ని అందించిన జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు కూడా స్వరాలందిస్తున్నారు.
విష్ణు విశాల్ ఈ సంవత్సరం ఇప్పటికే ‘ఎఫ్ఐఆర్’ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘మోహన్ దాస్’ అనే మరో థ్రిల్లర్ సినిమాలోనూ విష్ణు విశాల్ నటిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram