అన్వేషించండి

Manchu Vishnu: హాలీవుడ్ నటుడు విల్ స్మిత్‌తో మంచు విష్ణు... ఎంటర్టైన్మెంట్ రంగంలో మరో కొత్త అడుగు

Manchu Vishnu New Business: ప్రముఖ నటుడు మంచు విష్ణు తాజాగా తరంగ వెంచర్ అనే కొత్త ప్రాజెక్టును చెప్పబోతున్నట్టుగా వెల్లడించారు. ఇందులో విష్ణుతో పాటు విల్ స్మిత్ కూడా భాగం కాబోతున్నారని సమాచారం.

ప్రముఖ నటుడు మంచు విష్ణు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'కన్నప్ప'తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ రేంజ్ లో బిజినెస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. అది కూడా హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తో కలిసి. మంచి విష్ణు ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా, విద్యాసంస్థల నిర్వహకుడిగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తరంగా వెంచర్స్ పేరుతో మీడియా, ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.

దాదాపు 50 మిలియన్ల డాలర్ల నిధులతో ఏర్పాటు అవుతున్న ఈ సంస్థలో హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్ స్మిత్ కూడా భాగస్వామి కావడానికి రెడీగా ఉన్నారంటూ తాజాగా మంచు విష్ణు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా త్వరలోనే దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు అంటూ చెప్పుకోచ్చారు మంచు విష్ణు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, యానిమేషన్, గేమింగ్, బ్లాక్‌ చెయిన్, ఏఆర్, వీఆర్, ఏఐ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడి పెట్టబోతున్నారు. 

తరంగ వెంచర్స్ లో భాగం కాబోతున్న టీం 
1. విష్ణు మంచు - నటుడు, నిర్మాత, వ్యవస్థాపకుడు
2. అద్దిశ్రీ - పెట్టుబడులలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్థిక నిపుణుడు
3. ప్రద్యుమాన్ ఝలా - రియల్ ఎస్టేట్, పెన్షన్ ఫండ్స్‌లో ప్రత్యేకత కలిగిన కెనడియన్ బిజినెస్ మాన్
4. వినయ్ మహేశ్వరి - టాప్ ఇండియన్ కంపెనీలలో పని చేసిన అనుభవజ్ఞుడైన మీడియా నిపుణుడు
5. విల్ స్మిత్ - హాలీవుడ్ లెజెండరీ యాక్టర్. 
6. దేవేష్ చావ్లా, సతీష్ కటారియా - ఇన్వెస్ట్ అండ్ ఫండ్ ఆపరేషన్ వంటి కార్యకలపాలల్లో ఎక్స్పర్ట్స్ 

భారతదేశం, డెలావేర్ రెండింటిలోనూ రిజిస్టర్ చేసిన ఈ వెంచర్ ఎంటర్టైన్మెంట్ రంగంలో స్టార్టప్‌లకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, స్ట్రాటజిక్ మెంటార్షిప్ ను కూడా అందిస్తుంది. మొత్తానికి మంచు విష్ణు ఈ వెంచర్ ద్వారా సాంకేతికతో కూడిన ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి ముందడుగు వేయడం విశేషం.

Also Read: నేను ఎక్కడికీ పారిపోలేదు... పుకార్లకు మోహన్ బాబు చెక్ - ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే?

కొనసాగుతున్న మంచు వివాదం 
మరోవైపు మంచు మనోజ్, మంచు మోహన్ బాబుల మధ్య జరిగిన వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ గొడవ జరుగుతున్న క్రమంలో మోహన్ బాబు జర్నలిస్ట్ పై దాడి చేయడంతో జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమన్నాయి. అలాగే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కు అప్లై చేసిన మోహన్ బాబుకు చుక్కెదురైంది. దీంతో ఆయన పరారీలో ఉన్నారు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు తాను ఎక్కడికీ పారిపోలేదని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో కంప్లయింట్ చేసిన ఎం. రంజిత్ కుమార్ కు నోటీసులు జారీ చేశారని, కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు, కేసును ఈ నెల 19కి వాయిదా వేసిందని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే మోహన్ బాబు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. 

Read Also : Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget