అన్వేషించండి

డైరెక్టర్ కార్తీక్ వర్మకు బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన 'విరూపాక్ష' నిర్మాతలు

డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుకు 'విరూపాక్ష' సినిమా నిర్మాతలు ఓ క్రేజీ గిఫ్ట్ ను అందించారు. BVSN ప్రసాద్, సుకుమార్ కలిసి ఆయనకు నల్లటి మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి..

Karthik Varma Dandu : హీరో సాయిధరమ్ తేజ్, సంయుక్త నటించిన మిస్టిక్ థ్రిల్లర్ 'విరూపాక్ష' ఈ సంవత్సరం టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి OTT స్పేస్‌లో కూడా మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్ర నిర్మాతలు BVSN ప్రసాద్, సుకుమార్ కలిసి దర్శకుడు కార్తీక్ వర్మ దండుకు బ్లాక్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, సుకుమార్ కార్ కీస్‌ను కార్తీక్‌కు అందించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను దర్శకుడు కార్తీక్ దండు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తనకు 'విరూపాక్ష' నిర్మాతలు బహుమతిగా అందించిన మెర్సిడెస్ బెంజ్ కారును అందుకుంటున్న ఫొటోలను డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు సుకుమార్ లతో కలిసి ఆయన ఫొటోలకు ఫోజులిస్తూ కనిపించారు. దాంతో పాటు విరూపాక్ష తనకు జీవితకాల జ్ఞాపకాలను మిగిల్చిందని పోస్టులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా తను గురువు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. హీరో సాయి ధరమ్ తేజ్, నా నిర్మాతలు BVSN ప్రసాద్, బాపినీడు భోగవల్లికి ధన్యవాదాలు తెలిపారు.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా విమర్శకుల నుంచి సైతం సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు నుంచే 'విరూపాక్ష' దుమ్మురేపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ హిట్ ఖాతాలో పడింది.

'విరూపాక్ష' సినిమాకు భారీ విజయం దక్కడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా సాయి తేజ్, డైరెక్టర్ కార్తిక్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సాయి తేజ్‌కు ఈ సినిమా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చిందంటూ చిరంజీవి చెప్పారు. ఇలానే మంచి సినిమాలతో కెరీర్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశించారు. ఇక ఈ చిత్రంలో సంయుక్త యాక్టింగ్‌కి కూడా మంచి పేరు వచ్చింది. అలానే సీరియల్ నటుడు రవికృష్ణ ఇందులో చేసిన కుమార్ పాత్రకు కూడా ఊహించని రెస్పాన్స్ వచ్చింది. 

Read Also : షారుఖ్ ఖాన్ 'జవాన్' టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget