Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ పలు ఆసక్తికరగా ట్వీట్స్ చేయగా, ఆ ట్వీట్ కి రష్మిక మందన రిప్లై ఇస్తూ.." విజయ్ దేవరకొండ నువ్వు ఎప్పటికీ ది బెస్ట్" అని పేర్కొంది.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మధ్య బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆఫ్ స్క్రీన్ లోనూ ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు ఇప్పటికే చాలా రకాల వార్తలు వచ్చాయి. వీటన్నిటిని కాస్త పక్కన పెడితే.. తాజాగా రష్మిక విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ 'నువ్వు ఎప్పటికీ ది బెస్ట్' అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఉన్నట్టుండి రష్మిక విజయ్ గురించి ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి?
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'యానిమల్'. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నుంచి రణబీర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం ఉదయం టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా టీజర్ ని ఉద్దేశిస్తూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. 'యానిమల్' టీజర్ తనకు ఎంతో నచ్చిందని అన్నాడు." మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగ, రష్మిక అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణబీర్ కపూర్ కు ఆల్ ది బెస్ట్, హ్యాపీ బర్త్ డే" అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పై తాజాగా రష్మిక స్పందించింది." థాంక్యూ విజయ్ దేవరకొండ. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్" అని రిప్లై ఇచ్చింది.
Wishing my Darlings @imvangasandeep @iamRashmika ❤️ And my fav RK the very best and Happy Birthday! #AnimalTeaserhttps://t.co/O7zYnKIlA1
— Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2023
Thankyouuuuuuu @TheDeverakonda 🤗❤️
— Rashmika Mandanna (@iamRashmika) September 28, 2023
You be the bestestestestttt! ❤️ https://t.co/vz9MCFhsiA
దీంతో వీళ్ళ ట్వీట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జోడి పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'మీరు ఎప్పటికీ బెస్ట్ ఫెయిర్' అని సోషల్ మీడియాలో వరస పోస్టులు పెడుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు 'యానిమల్' టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. టీజర్ చాలా వయొలెంట్‌గా నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ మొదటిసారి 'గీతాగోవిందం' సినిమాలో కలిసి నటించారు. పరశురాం డైరెక్ట్ చేసిన ఈ మూవీతో వెండితెరపై సూపర్ హిట్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' సినిమాలో కలిసి నటించారు. అందులోనూ మరోసారి తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అదరగొట్టారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరగడం, చాలాసార్లు విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మిక కనిపించడం చూసి వీరికి సంబంధించి ఎన్నో రకాల రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా రష్మిక చేసిన ట్వీట్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక 'యానిమల్' విషయానికొస్తే.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాలో రణబీర్ కపూర్ ని మోస్ట్ వైలెంట్ మాస్ హీరోగా ప్రజెంట్ చేయబోతున్నారు. తాజాగా విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read : వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య