News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వీరాభిమాని మృతి - ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన సూర్య

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వీరాభిమాని మృతి పట్ల కన్నీటి పర్యంతమయ్యారు కోలీవుడ్ హీరో సూర్య. ఈ మేరకు అభిమాని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

FOLLOW US: 
Share:

అభిమానుల పట్ల ఉదారత చూపించడంలో కోలీవుడ్ అగ్ర హీరో సూర్య ముందు వరుసలో ఉంటారు. ఇటీవల సూర్య వీరాభిమాని అరవింద్ రోడ్డు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తాజాగా చెన్నైలోని ఎన్నూరులో ఆ వీరాభిమాని ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని ఓదార్చి, ధైర్యం చెప్పారు. అరవింద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇస్తూ, అరవింద్ మరణం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా  ఆయన్ని అభిమానించే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా నిలబడడం, ముఖ్యంగా మహిళలకు గౌరవం ఇవ్వడం, చిన్న పిల్లలను, అనాధ పిల్లలను చదివించడం లాంటి మంచి పనులే ఆయన్ని అందరూ అభిమానించేలా చేశాయి. ఒక తమిళ హీరోను తెలుగు ప్రేక్షకులు ఇంతగా అభిమానించడం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన పుట్టినరోజు వచ్చిందంటే కటౌట్స్ కట్టి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేస్తూ నానా సందడి చేస్తుంటారు. ఈ ఏడాది సూర్య పుట్టిన రోజున ఆయన కటౌట్స్ పెట్టబోయి ఇద్దరు అభిమానులు కరెంట్ షాక్ కొట్టి మృతి చెందిన విషయం తెలిసిందే కదా.

అది తెలుసుకొని సూర్య వెంటనే స్పందించి ఆ యువకుల కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పి అందరి మన్ననలు అందుకున్నారు. ఇక ఇప్పుడు అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకొని స్వయంగా అతను ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. చెన్నైలోని ఎన్నూరులో నివసించే అరవింద్ అనే యువకుడు సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్లబ్లో కొన్నేళ్లుగా మెంబర్ గా కూడా పనిచేశాడు. దురదృష్టవశాత్తు అరవింద్ ఇటీవల ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషయం తెలియడంతో సూర్య తాజాగా అరవింద్ ఇంటికి వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులని పరామర్శించారు.

అరవింద్ లేని లోటును తాను తీరుస్తానని, వారికి ఎటువంటి సహాయం కావాలన్నా చేస్తానని ముందుకొచ్చి వాళ్ల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి, అరవింద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు సూర్య ని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'సూర్య రియల్ హీరో' అంటూ వరుస పోస్టులు పెడుతున్నారు.

ఇక సూర్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం 'కంగువ'(Kanguva) అనే పీరియాడికల్ పాన్ పాండియా మూవీలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీత అందిస్తున్న ఈ చిత్రాన్ని 2D,3D వెర్షన్స్ లో సుమారు 10 భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Also Read :'ఆర్.ఆర్.ఆర్, 'పుష్ప' సినిమాల్లో ఏముందని చూడటానికి? బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 28 Sep 2023 06:16 PM (IST) Tags: Suriya Actor Suriya Tamil Actor Suriya Suriya pays respect to his fan Tamil Hero Suriya

ఇవి కూడా చూడండి

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్‌ చేసిందెవరు? క్లూస్‌ టీమ్‌లో హీరో ఏం చేశాడు?

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Randeep Hooda: మణిపూర్ యువతిని పెళ్లాడిన బాలీవుడ్ హీరో - వెడ్డింగ్ ఫొటోలు వైరల్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

Animal Movie Leak : 'యానిమల్' మూవీకి భారీ షాక్ - రిలీజైన కొన్ని గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ లీక్

టాప్ స్టోరీస్

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Pawan Kalyan Comments: 'జనసేనకు యువతే పెద్ద బలం' - వైసీపీ కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని శ్రేణులకు పవన్ దిశా నిర్దేశం

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి