News
News
X

Venkatesh's Saindhav Movie : వెంకటేష్ 'సైంధవ్'లో యంగ్ హీరోయిన్‌కు ఛాన్స్!

Ruhani Sharma In Saindhav Movie : విక్టరీ వెంకటేష్ హీరోగా 'హిట్' దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'. ఇందులో యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ కూడా ఉన్నారు.

FOLLOW US: 
Share:

విక్టరీ వెంకటేష్ (Venkatesh) కథానాయకుడిగా 'హిట్' ఫ్రాంచైజీ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' (Saindhav Movie). ఆల్రెడీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదల చేశారు. ఇదొక మాస్ అండ్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. వెంకటేష్ 75వ చిత్రమిది. ఫస్ట్ లుక్ చూస్తే... ఆయన రగ్గడ్ లుక్, ఇంటెన్సిటీ బావున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారు.

'సైంధవ్'లో రుహానీ శర్మ!
హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి, సుశాంత్ జోడీగా 'చిలసౌ'లో నటించిన కథానాయిక రుహానీ శర్మ (Ruhani Sharma) గుర్తు ఉన్నారా? 'సైంధవ్'లో ఆమెకు కీలక పాత్ర దక్కింది. శైలేష్ కొలను తెరకెక్కించిన తొలి సినిమా 'హిట్ : ది ఫస్ట్ కేస్'లో ఆమె నటించారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. రుహానీకి మరోసారి శైలేష్ అవకాశం ఇచ్చారు. ఈ 'సైంధవ్'లో ఆమెది కథానాయిక పాత్ర కాదని తెలిసింది. గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న పాత్ర అట! 

మార్చి నెలాఖరులో సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. వెంకటేష్, రుహానీ శర్మ సహా ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర చేస్తున్నారు. 

Also Read మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ఫ్యామిలీ 

View this post on Instagram
 
A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

ఐదు భాషల్లో 'సైంధవ్'
'సైంధవ్' వెంకటేష్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కానుంది. దీని కంటే ముందు నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' విడుదల కానుంది. అలాగే, సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' సినిమాతో హిందీ ప్రేక్షకులను పలకరించనున్నారు. హిందీ 'హిట్' ద్వారా శైలేష్ కొలను హిందీ ప్రేక్షకులకు తెలుసు. 'సైంధవ్'ను తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.

హెయిర్ స్టైల్ చేంజ్ చేసిన వెంకీ!
గత కొన్నేళ్ళుగా ప్రతి సినిమాలోనూ వెంకటేష్ దాదాపు ఒకే తరహా లుక్ మైంటైన్ చేస్తున్నారు. మధ్యలో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ లో కనిపించినా... చాలా రోజులుగా హెయిర్ స్టైల్ చేంజ్ చేయలేదు. 'సైంధవ్' కోసం ఆయన హెయిర్ స్టైల్ చేంజ్ చేసినట్టు ఈ లుక్ చూస్తుంటే తెలుస్తోంది. 

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ 

వెంకటేష్‌కు శైలేష్‌తో చేస్తున్న సినిమానే చివరి మైల్‌స్టోన్ మూవీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం సీనియర్ హీరోలు అందరిలో మెల్లగా సినిమాలు చేస్తూ వెళ్తుంది వెంకీనే. ఈ స్పీడ్‌లో మరో 25 సినిమాలు పూర్తి చేయడం అంటే దాదాపు ఇంపాజిబుల్ అని చెప్పవచ్చు. కాబట్టి ఈ సినిమాను మెమరబుల్‌గా మార్చుకోవడానికి వెంకటేష్ చాలా కష్టపడతారు.  

నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి 'సైంధవ్'ను నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది. ‘శ్యామ్ సింగ రాయ్’ తర్వాత నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. హిట్‌వర్స్ కాకుండా కొత్త కథతో శైలేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, సినిమాటోగ్రఫీ : ఎస్. మణికందన్, ఎడిటింగ్: గ్యారీ బీహెచ్, సంగీత దర్శకుడు : సంతోష్ నారాయణన్.

Published at : 05 Mar 2023 08:43 AM (IST) Tags: Venkatesh Pan india movie Ruhani Sharma Sailesh kolanu Saindhav Movie

సంబంధిత కథనాలు

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Taraka Ratna Wife Alekhya : కోయంబత్తూరు వెళ్లిన తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Mahesh Babu Vacation : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!

Mahesh Babu Vacation : హమ్మయ్యా, మహేష్ బాబుకు కొంచెం రెస్ట్ ఇస్తున్న త్రివిక్రమ్!

టాప్ స్టోరీస్

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్‌ చూడండి

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు

TSRTC Ticket Fare: టోల్‌ ఛార్జి పెరిగింది ఆర్టీసీ ప్రయాణికులకు మోత మోగనుంది

TSRTC Ticket Fare: టోల్‌ ఛార్జి పెరిగింది ఆర్టీసీ ప్రయాణికులకు మోత మోగనుంది