News
News
X

Mohan Babu At Manoj Wedding : మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ఫ్యామిలీ 

మంచు మనోజ్ మళ్ళీ ఓ ఇంటి వాడు అయ్యారు. నాగ మౌనికతో ఏడడుగులు నడిచారు. అయితే, ఈ పెళ్లికి మోహన్ బాబు అంగీకరించలేదని పుకార్లు షికారు చేశాయి. వాటిని ఫొటోలే చెక్ పెట్టాయని చెప్పవచ్చు. 

FOLLOW US: 
Share:

యువ కథానాయకుడు మంచు మనోజ్ (Manchu Manoj) మళ్ళీ ఓ ఇంటి వాడు అయ్యారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు... శుభ ముహూర్తాన భూమా నాగ మౌనిక రెడ్డి (Bhuma Naga Mounika Reddy)తో ఏడు అడుగులు వేశారు. ఆమె మెడలో మూడు ముళ్ళు వేసి జీవిత భాగస్వాములు అయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. అయితే, ఈ పెళ్లికి ముందు కొన్ని పుకార్లు వినిపించాయి. వాటికి పెళ్లి ఫోటోలతో మంచు ఫ్యామిలీ చెక్ పెట్టింది.

మోహన్ బాబు అశీసులతో...
మంచు మనోజ్ (Manchu Manoj Second Marriage) కు రెండో పెళ్లి ఇది. అటు భూమా నాగ మౌనికకూ రెండో వివాహమే. ఇద్దరి ప్రేమకు మనోజ్ తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని పెళ్లికి ముందు ప్రచారం జరిగింది. 'పద్మ శ్రీ' పురస్కార గ్రహీత, కలెక్షన్ కింగ్, డా మోహన్ బాబు తనయుడి నిర్ణయానికి అంగీకారం తెలపలేదని గుసగుసలు వినిపించాయి.
 
మెహందీ, సంగీత్ వేడుకలకు సైతం మోహన్ బాబు రాలేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో పుకార్లు షికారు చేశాయి. వాటి అన్నిటికీ పెళ్లి ఫొటోలే సమాధానం చెప్పారు. మనోజ్, కొత్త కోడలు మౌనికను మోహన్ బాబు ఆశీర్వదించిన ఫోటోలను మంచు ఫ్యామిలీ విడుదల చేసింది. దాంతో మోహన్ బాబు కోపంగా ఉన్నారనేది అవాస్తం అని తేలింది.
 
పెళ్ళిలో భూమా ఫ్యామిలీ కూడా
దివంగత రాజకీయ నాయకులు భూమా నాగి రెడ్డి, భూమా శోభా రెడ్డి దంపతుల రెండో కుమార్తె నాగ మౌనిక. తల్లిదండ్రుల మరణం తర్వాత పిల్లల మధ్య ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయని రాయలసీమ రాజకీయ వర్గాల కథనం. ఆ గొడవలు పక్కన పెడితే... భూమా ఫ్యామిలీ కూడా పెళ్లిలో సందడి చేసింది. మౌనిక అక్క అఖిల ప్రియా, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా పెళ్ళికి వచ్చారు. మొత్తం మీద ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు మనోజ్, భూమా నాగ మౌనికా రెడ్డి పెళ్లి చేసుకున్నారు.

Also Read : 'బాహుబలి 2'ను బీట్ చేసిన 'పఠాన్' - బాలీవుడ్ కాలర్ ఎగరేసిన షారుఖ్
 
View this post on Instagram
 
A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu)

మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో జంటగా కనిపించారు. ఆ సమయంలో  గణనాథుడికి పూజలు చేశారు. అప్పుడే ప్రేమ విషయం బయటకు వచ్చింది. అప్పుడు పెళ్లి గురించి ప్రశ్నించగా... అది తన వ్యక్తిగత విషయం అని చెప్పారు. ఆ తర్వాత డిసెంబర్ నెలలో కడప దర్గాను మనోజ్ సందర్శించారు. అక్కడ కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. అప్పుడు మనోజ్, భూమిక పెళ్లి చేసుకుంటారనే స్పష్టత వచ్చింది.

మనోజ్ తొలి వివాహం విషయానికి వస్తే... ప్రణతి రెడ్డిని 2015లో ఆయన పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ వివాహ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. తమ దారులు వేర్వేరు అంటూ 2019లో విడిపోయారు. విడాకుల తర్వాత చాలా రోజులు మనోజ్ ఒంటరిగా ఉన్నారు.

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ 

Published at : 04 Mar 2023 02:50 PM (IST) Tags: Manchu Manoj Mohan Babu Bhuma Naga Mounika Manoj Weds Mounika Manoj Second Marriage

సంబంధిత కథనాలు

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Jagapathi Babu Mother House: జగపతి బాబు తల్లి సింప్లిసిటీ, కొడుకు ఎంత పెద్ద స్టారైనా చిన్న ఇంట్లోనే నివాసం - ఇదిగో వీడియో

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Anni Manchi Sakunamule: 'అన్నీ మంచి శ‌కున‌ములే' నుంచి సీతా కళ్యాణం సాంగ్ రిలీజ్

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

Manisha Koirala: రజినీకాంత్ సినిమా వల్లే అక్కడ మూవీ ఛాన్సులు పోయాయి - మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?

IPL 2023: ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటో! మరి రోహిత్‌ ఎక్కడా?