Chiranjeevi - Udaya Bhanu: ఉదయభానుకి చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? 'త్రిబాణధారి బార్బరిక్' ఈవెంట్‌లో ఏం చెప్పిందంటే?
Udaya Bhanu about Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తనకు ఒక గిఫ్ట్ ఇచ్చారని ఉదయ భాను చెప్పారు. 'త్రిబాణధారి బార్బరిక్' సినిమా వేడుకలో మెగా గిఫ్ట్ గురించి రివీల్ చేశారు. అది ఏమిటంటే?

ఉదయభాను (Udaya Bhanu) చాలా ఏళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ మీద సందడి చేయబోతోన్నారు. ఉదయభాను అంటే ఒకప్పుడు బుల్లితెర, వెండితెరపై ఎక్కువగా వినిపించేవారు, కనిపించేవారు. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా రాణించిన ఉదయభాను... వెండితెరపై సినిమాలతో అలరించారు. స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టేశారు. అయితే ఉదయభాను తరువాత చాలా గ్యాప్ తీసుకున్నారు. ఎన్ని కథలు వచ్చినా రిజెక్ట్ చేస్తూ ఉన్నారట.
'త్రిబాణధారి బార్బరిక్'లో ఉదయభాను
ఎట్టకేలకు 'త్రిబాణధారి బార్బరిక్' అనే మూవీలో పద్మక్క అనే ఓ పవర్ ఫుల్ పాత్రను ఉదయభాను ఒప్పుకొన్నారు. తన రియల్ లైఫ్ పాత్రకు ఈ కారెక్టర్ దగ్గరగా ఉందని, ఓ పవర్ ఫుల్, ఇండిపెండెంట్ ఉమెన్ పాత్రను పోషిస్తున్నాను అంటూ ఉదయభాను చెప్పుకొస్తున్నారు. ఇక 'త్రిబాణధారి బార్బరిక్' మూవీని మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ నిర్మిస్తుండగా.. మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు.

'త్రిబాణధారి బార్బరిక్' చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటన మంగళవారం నాడు జరిగింది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఉదయభాను సందడి చేశారు. అసలే 'ఇస్కితడి ఉస్కితడి...' అనే పాటతో ఉదయభాను సోషల్ మీడియాని, రీల్స్‌ను ఊపేస్తున్నారు. మంగళవారం నాడు జరిగిన ఈవెంట్లోనూ స్టేజ్ మీద స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఇక ఇదే ఈవెంట్‌లో ఉదయభాను మాట్లాడుతూ తనకు చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.
Also Read: స్టుపిడ్ పొలిటీషియన్స్... మండిపడ్డ రేణూ దేశాయ్... అసలు కారణం ఏమిటంటే?
చిరంజీవి తనను కెరీర్ ఆరంభంలో ఎంతో ఎంకరేజ్ చేశారు.. తనకు మొదటి ఫోన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది కూడా చిరంజీవి గారే అని, ఆయన బర్త్ డే సందర్భంగా మా సినిమాను రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది అంటూ ఉదయభాను తనకు మెగాస్టార్‌తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇదే ఈవెంట్లో సత్య రాజ్ కూడా చిరంజీవి గురించి గొప్పగా చెప్పారు. చిరు కంప్లీట్ యాక్టర్ అని, కాలు కదిపినా, చేయి ఆడించినా, కామెడీ చేసినా, యాక్షన్ చేసినా, డ్యాన్స్ చేసినా అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయని, ఆయన కంప్లీట్ యాక్టర్ అని పొగిడేశారు. అలాంటి చిరంజీవి బర్త్ డే సందర్భంగా మా సినిమాను రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉందని సత్య రాజ్ అన్నారు.





















