విడాకుల దిశగా స్టార్ కపుల్?, భజే వాయు వేగం రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
![విడాకుల దిశగా స్టార్ కపుల్?, భజే వాయు వేగం రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే! Top 5 Entertainment Updates Latest Movie and TV News From ABP News May 8th 2024 విడాకుల దిశగా స్టార్ కపుల్?, భజే వాయు వేగం రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/08/97518fb6c23e33fde295fd624a705ba41715168285414929_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భజే వాయు వేగం రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ సమర్పణలో యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) నటిస్తున్న సినిమా 'భజే వాయు వేగం' (Bhaje Vayu Vegam Movie). యూవీ కాన్సెప్ట్స్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రభాస్ 'కల్కి 2898 AD' మూవీలో మహేష్ బాబు?
Will Mahesh Babu to be Part in Prabhas Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 AD'. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్, స్పెషల్ వీడియోస్‌తో మూవీ మరింత హైప్ క్రియేట్ అయ్యింది. నాగ్ అశ్విన్ మేకింగ్ స్టైల్, విజన్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయా అని ఫ్యాన్స్ అంతా అంచనాలు వేసుకుంటున్నారు. దానికి తోడు భారీ తారాగణం ఈ చిత్రంలో భాగమైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్
ముంబై మూవీ లవర్స్ మధ్యలో మంగళవారం అంతా ఒక్కటే డిస్కషన్... బాలీవుడ్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకోన్ విడిపోతున్నారా? వాళ్లిద్దరి మధ్య ఏమైంది? ఏం జరుగుతోంది అసలు? అని తెలుసుకోవడానికి ప్రేక్షక లోకం కూడా విపరీతమైన ఆసక్తి కనబరిచింది. అందుకు కారణం రణవీర్ సింగ్ అని చెప్పాలి. ఇంతకీ ఆయన ఏం చేశారు? అనేది చూస్తే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
యాంకర్ కాపురంలో కలహాలు
టాలీవుడ్ సర్కిల్‌లో ఇప్పుడొక యాంకర్ పర్సనల్ లైఫ్ హాట్ టాపిక్‌గా మారింది. చిన్న వయసులో యాంకరింగ్‌లో ఆ అమ్మడు అడుగు పెట్టింది. టీవీలో పెద్దగా షోస్ చేసిన ట్రాక్ రికార్డ్ లేదు. సోషల్ మీడియాలో పాపులారిటీ ఫుల్లుగా వుందని చెప్పవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్లు ఎక్కువ మంది వున్నారు. ఆల్మోస్ట్ ఐదు లక్షల మంది. యాంకరింగ్ ట్యాలెంట్ కంటే గ్లామర్ వల్ల హైలైట్ అయ్యే ఆ అందాల భామ ఇప్పుడు వొంటరిగా వుంటోందట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్
ఇండియన్ బాక్సాఫీస్ బరిలో 'సలార్' (Salaar Part 1 Ceasefire) వసూళ్ల సునామీ సృష్టించింది. కలెక్షన్స్ హిస్టరీలో 500 కోట్ల క్లబ్బులో చేరిన మరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాగా నిలిచింది. అతి త్వరలో సీక్వెల్ 'సలార్ 2' (Salaar 2 Movie) సెట్స్ మీదకు వెళ్లనుంది. మే నెలాఖరులో లేదంటే జూన్ మొదటి వారంలో షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే... లేటెస్టుగా 'సలార్'లో తన క్యారెక్టర్ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చేసిన ట్వీట్ సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ పెంచింది. అసలు వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)