Salaar 2: 'సలార్ 2'పై పృథ్వీరాజ్ ట్వీట్ - 'కెజియఫ్'తో లింక్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
Prithviraj Sukumaran Tweet On Shiva Mannar: రెబల్ స్టార్ 'సలార్'లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. సినిమాలో తన క్యారెక్టర్ గురించి ఆయన చేసిన లేటెస్ట్ ట్వీట్ అంచనాలు పెంచుతోంది.
ఇండియన్ బాక్సాఫీస్ బరిలో 'సలార్' (Salaar Part 1 Ceasefire) వసూళ్ల సునామీ సృష్టించింది. కలెక్షన్స్ హిస్టరీలో 500 కోట్ల క్లబ్బులో చేరిన మరో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాగా నిలిచింది. అతి త్వరలో సీక్వెల్ 'సలార్ 2' (Salaar 2 Movie) సెట్స్ మీదకు వెళ్లనుంది. మే నెలాఖరులో లేదంటే జూన్ మొదటి వారంలో షూట్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే... లేటెస్టుగా 'సలార్'లో తన క్యారెక్టర్ గురించి పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చేసిన ట్వీట్ సినిమాపై ఒక్కసారిగా మరింత హైప్ పెంచింది. అసలు వివరాల్లోకి వెళితే...
'సలార్' సినిమాలో శివ క్యారెక్టర్ చాలా కూల్!
'సలార్'లో పృథ్వీరాజ్ సుకుమారన్ డ్యూయల్ రోల్ చేశారు. తండ్రి కుమారులుగా సినిమాలో నటించారు. ఓ క్యారెక్టర్ పేరు వరదరాజ మన్నార్ అయితే మరో రోల్ పేరు శివ మన్నార్. అందులో శివ క్యారెక్టర్ చాలా కూల్ అని పృథ్వీరాజ్ తాజాగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం శివ రోల్ గురించి ప్రస్తావన ఎందుకు వచ్చింది? అంటే... ''ఒంటిచేత్తో శివ పరిస్థితులను కూల్‌గా హ్యాండిల్ చేశాడు. అతడిని స్క్రీన్ మీద మరింత సేపు చూస్తే బావుంటుందని అనిపించింది'' అని నెటిజన్ పేర్కొన్నాడు.
''ప్రశాంత్ నీల్ చెప్పిన కథలు అన్నిటిలోకెల్లా శివ క్యారెక్టర్ కూలెస్ట్. ప్రేక్షకులు ఎవరూ ఊహించని విధంగా శివ పాత్రకు మరొక యూనివర్స్‌తో క్రాస్ ఓవర్ ఉంటుంది'' అని పృథ్వీరాజ్ సుకుమారన్ పేర్కొన్నారు.
Also Read: 'ప్రతినిధి 2'లో వైయస్సార్ మరణం గుర్తు చేసేలా - టార్గెట్ వైఎస్ జగన్?
Of all the stories Prashanth has told me..Shiv Mannar’s is probably the coolest. Has an unbelievable cross over with another universe as well. 😊 https://t.co/edOXTaNsZx
— Prithviraj Sukumaran (@PrithviOfficial) May 7, 2024
'కెజియఫ్'తో కనెక్ట్ చేస్తారా? ఎన్టీఆర్ సినిమాతోనా?
'సలార్' విడుదలకు ముందు ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్... ముగ్గురితో రాజమౌళి ఓ ఇంటర్వ్యూ చేశారు. అందులో 'కెజియఫ్'తో ఈ కథను కనెక్ట్ చేశారా? అని అడిగితే... 'లేదు' అని ప్రశాంత్ నీల్ చాలా స్పష్టంగా చెప్పారు. తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చేసినట్టు తాను చేయలేనని ఆయన వివరించారు. కానీ, పృథ్వీరాజ్ లేటెస్ట్ ట్వీట్ కొత్త ఊహలకు ఆస్కారం ఇచ్చినట్టు అయ్యింది.
శివ పాత్రను 'కెజియఫ్' కథతో కనెక్ట్ చేస్తారా? లేదంటే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించనున్న సినిమాతో కనెక్ట్ చేస్తారా? అనేది చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్!
ప్రభాస్ వర్సెస్ పృథ్వీరాజ్ ఫైట్ ఎలా ఉంటుందో?
శత్రువులుగా మారిన ఇద్దరు ప్రాణ స్నేహితులు కథతో 'సలార్' తెరకెక్కింది. ఫస్ట్ పార్టులో ఇద్దరి మధ్య స్నేహాన్ని చూపించారు. సినిమా చివరిలో శౌర్యంగ పర్వం అనౌన్స్ చేశారు. అందులో మన్నార్ తెగకు చెందిన వ్యక్తిగా పృథ్వీరాజ్ రోల్, శౌర్యాంగుడిగా ప్రభాస్ కనిపించనున్నారు. వాళ్లిద్దరి మధ్య ఫైట్ ఎలా ఉంటుందో పార్ట్ 2లో చూడాలి.
Also Read: మారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?