అన్వేషించండి

Pratinidhi 2: 'ప్రతినిధి 2'లో వైయస్సార్ మరణం గుర్తు చేసేలా - టార్గెట్ వైఎస్ జగన్?

Pratinidhi 2 release trailer: 'ప్రతినిధి 2' విడుదల కానివ్వకూడదని కొందరు చేసిన ప్రయత్నాల వల్ల సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యమైందని గుసగుస. లేటెస్ట్ రిలీజ్ ట్రైలర్ జగన్‌ను టార్గెట్ చేసేలా ఉంది.

'ప్రతినిధి 2'పై వైసీపీ పార్టీ సానుభూతిపరులు విమర్శలు చేశారు. ఆ సినిమా తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి వ్యతిరేకంగా ఉంటుందని ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి సోదరుని కుమారుడు నారా రోహిత్ 'ప్రతినిధి 2'లో హీరో కావడం, టీడీపీ సానుభూతిపరుడిగా ముద్ర పడిన జర్నలిస్ట్ మూర్తి దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి వైసీపీ వర్గాలు అభ్యంతరాలు చెబుతున్నాయి. 

ఓ దశలో సినిమా విడుదల కాకుండా ఉండటం కోసం వైసీపీ వర్గాలు చేసిన ప్రయత్నాల వల్ల సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం అయ్యిందని ఇండస్ట్రీ టాక్. అది పక్కన పెడితే... ఇవాళ విడుదలైన రిలీజ్ ట్రైలర్ చూస్తే 'టార్గెట్ వైఎస్ జగన్' అనేలా ఉందని ఎవరైనా చెబుతారు.

పవర్ చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే!
'ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకున్నావ్? నీ నేపథ్యం ఏమిటి?' - ఇదీ 'ప్రతినిధి 2' రిలీజ్ ట్రైలర్‌లో వినిపించే మొదటి డైలాగ్. ఓ సీఎం మీద మర్డర్ అటెంప్ట్ చేసిన ఆరోపణ మీద అరెస్ట్ అయ్యే జర్నలిస్ట్ పాత్రలో నారా రోహిత్ కనిపిస్తారని అర్థం అవుతోంది. సీఎం చనిపోయిన దృశ్యాలు సైతం చూపించారు. 

'ప్రతినిధి 2'లో ముఖ్యమంత్రిగా సచిన్ ఖేడేకర్, ఆయన తనయుడి పాత్రలో 'ప్లే బ్యాక్', 'అలా నిన్ను చేరి' సినిమాల ఫేమ్ దినేష్ తేజ్ నటించారు. ''అన్నయ్య ఆశయాలను మాత్రం నువ్వే ముందుకు తీసుకు వెళ్ళలిరా'' అని దినేష్ తేజ్ (Dinesh Tej)తో బాబాయ్ పాత్రధారి చెబితే... ''ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నాన్నగారు చనిపోయి పదిహేడు రోజులు కూడా కాలేదు. అప్పుడే రాజకీయాలు మొదలు పెట్టేశారా?'' అని సమాధానం ఇవ్వడం చూస్తుంటే తండ్రీ తనయులు వైయస్సార్ - జగన్ మోహన్ రెడ్డి పాత్రలు గుర్తుకు రావడం ఖాయం. 

'పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయ్. మనల్ని ఎవడేం చేస్తాడు' అని దినేష్ తేజ్ చెప్పే మాట ఎవరికి తగులుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే... ముఖ్యమంత్రి మరణానికి కారణమైన బాంబు బ్లాస్ట్ చేసినది ఎవరు? అనేది ఇక్కడ క్యూరియాసిటీ కలిగించే అంశం. మే 10న... మరో రెండు రోజుల్లో 'ప్రతినిధి 2' థియేటర్లలోకి వస్తోంది. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరుగుతాయి.

Also Read: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణవీర్ - దీపికకు దణ్ణం పెట్టేశాడా? ఇక విడాకులేనా?


ఏపీలో ఎన్నికలకు ముందు థియేటర్లలో వచ్చే 'ప్రతినిధి 2' ప్రజలపై ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ సంస్థలపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ప్రొడ్యూస్ చేశారు. థియేట్రికల్ అమోఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది.

Also Readమారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?


ఈ సినిమాలో సిరీ లెల్ల, సప్తగిరి, జిష్షు సేన్‌ గుప్తా, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృథ్వీరాజ్ (30 ఇయర్స్ పృథ్వీ), రఘు బాబు, రఘు కారుమంచి కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget