అన్వేషించండి

Prabhas: మారుతిని మరింత వెయిటింగ్‌లో పెడుతున్న ప్రభాస్ - ఏంటిది రాజా సాబ్?

Raja Saab Movie Update: ప్రభాస్ నిర్ణయంతో 'రాజా సాబ్' వెనక్కి వెళుతుందా? పాన్ ఇండియా యాక్షన్ ఫిల్మ్ కోసం ఏరి కోరి ఎంచుకున్న ఎంటర్‌టైనర్‌ను ప్రభాస్ వెనక్కి పెట్టాడా? అంటే 'అవును' అని చెప్పాలి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్పీడుగా సినిమా కంప్లీట్ చేసే దర్శకుల జాబితాలో పూరి జగన్నాథ్ పేరు తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. ఆయన తరహాలో చకచకా సినిమా పూర్తి చేసే మరో దర్శకుడు మారుతి (Director Maruthi). స్పీడుగా తీసినా సరే క్వాలిటీ మిస్ కాకుండా చూడటం ఆయన స్పెషాలిటీ. చిన్న సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ చేసి ఇవాళ పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas)తో సినిమా చేసే స్థాయికి ఎదిగారు. అయితే, ప్రభాస్ సినిమా ఆయన్ను ఎక్కువ కాలం ఓ సినిమా మీద ఉండేలా చేస్తోందని ఇండస్ట్రీ గుసగుస. అసలు మ్యాటర్ ఏమిటంటే?

'సలార్ 2' కోసం 'రాజా సాబ్' వెనక్కి?
ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రాజా సాబ్' (Raja Saab Movie). ఈ ఏడాది... మొన్న సంక్రాంతికి హీరో ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఆ లుక్కుతో పాటు సినిమా టైటిల్ కూడా అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే... ఈ సినిమా అనౌన్స్ చేయడానికి ఎన్నో రోజుల ముందు నుంచి మేకింగ్‌లో ఉంది. ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే... ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి 2989 ఏడీ' మూవీస్ కూడా ఉండటంతో అనౌన్స్ చేయలేదు. 

'ఆదిపురుష్', 'సలార్' కంప్లీట్ చేశాక 'రాజా సాబ్' సినిమా చిత్రీకరణకు బల్క్ డేట్స్ ఇస్తానని ప్రభాస్ ప్రామిస్ చేశారట. యూరప్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత రెండు నెలలు... ఏప్రిల్ & మేలో షూటింగ్ ఫినిష్ చేద్దామని చెప్పారట. అయితే... లాస్ట్ మంత్ ఒక్క వారమే షూట్ చేశారట. ఈ నెలలో షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగడం కష్టమని ఇండస్ట్రీ గుసగుస. ఈ నెలాఖరు నుంచి 'సలార్ 2'కు ఆయన డేట్స్ ఇచ్చారు.

Also Readగీతాంజలి మళ్ళీ వచ్చింది... ఈ రాత్రి నుంచి స్ట్రీమింగ్ షురూ, ఏ ఓటీటీలోనో తెలుసా?

దర్శకుడు ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసి, షెడ్యూల్స్ కూడా ప్లాన్ చేసి రెడీగా ఉండటంతో 'సలార్ 2'కు ప్రభాస్ డేట్స్ ఇచ్చారు. యాక్షన్ సీక్వెన్సులు ముందు షూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. మారుతి స్క్రిప్ట్ రెడీ కాలేదని కాదు, ఆయన కూడా బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారు. అయితే... ఆ మూవీ రొమాంటిక్ హారర్ కామెడీ జానర్ కావడంతో ఈజీగా షూట్ కంప్లీట్ చెయ్యవచ్చని రెబల్ స్టార్ ప్లాన్. దాంతో మారుతి మరి కొన్నాళ్లు వెయిట్ చేయక తప్పని పరిస్థితి.

మారుతి వెయిటింగే కాదు... విడుదల కూడా వెనక్కి!?
షూటింగ్, సినిమా కంప్లీట్ చేయడం విషయంలోనే కాదు... రిలీజ్ డేట్ పరంగా కూడా 'సలార్ 2' వల్ల 'రాజా సాబ్' వెనక్కి వెళ్లే పరిస్థితి కనబడుతోందని టాలీవుడ్ టాక్. ఒకవేళ 'సలార్ 2'ను ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ రిలీజ్ చేస్తే... ఆ వెంటనే సంక్రాంతికి 'రాజా సాబ్' రిలీజ్ చేయడం కుదరని పని. పైగా, చిరంజీవి హీరోగా ప్రభాస్ కజిన్ ప్రమోద్ కూడా ఓ నిర్మాతగా చేస్తున్న 'విశ్వంభర'ను సంక్రాంతి బరిలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. దాంతో 'రాజా సాబ్' వెనక్కి వెళ్ళినట్టే.

Also Readవిద్య వాసుల అహం... థియేటర్లలో కాదు, డైరెక్టుగా ఓటీటీలో!

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget