Geethanjali Malli Vachindi OTT: గీతాంజలి మళ్ళీ వచ్చింది... ఈ రాత్రి నుంచి ఆహాలో స్ట్రీమింగ్ షురూ
Geethanjali Malli Vachindi OTT Platform: హీరోయిన్ అంజలి 50వ సినిమా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
కథానాయికగా తెలుగు అమ్మాయి అంజలి (Anjali) ప్రయాణంలో 'గీతాంజలి' చాలా అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. మహిళా ప్రాధాన్య చిత్రాలకు ఆమె పర్ఫెక్ట్ యాప్ట్ అని చాటి చెప్పిన చిత్రమది. అందుకని, తన 50వ సినిమాగా ఆ 'గీతాంజలి' సీక్వెల్ (Geethanjali Malli Vachindi)ని ఎంపిక చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది.
ఆహాలో రేపట్నుంచి 'గీతాంజలి 2'
Geethanjali Malli Vachindi Movie OTT Release Date: 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల చేశారు. అమెరికాలో ఏప్రిల్ 10న ప్రీమియర్ షోలు వేశారు. థియేటర్లలో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అందువల్ల, కొందరు సినిమాను మిస్ అయ్యారు. వాళ్లకు ఓ గుడ్ న్యూస్. ఈ వారమే 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' ఓటీటీలోకి వస్తోంది.
Geethanjali Malli Vachindi Digital Streaming Date: మే 8వ తేదీ నుంచి 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాను తమ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ తెలియజేసింది.
Also Read: విద్య వాసుల అహం... థియేటర్లలో కాదు, డైరెక్టుగా ఓటీటీలో!
Akka nv malli vachavaa...!😯
— ahavideoin (@ahavideoIN) May 6, 2024
Sare aha lo kaluddam...🙂#GeethanjaliMalliVachindhi premieres May 08. #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati #SujathaSiddarth @Actorysr @Satyamrajesh2 @suneeltollywood #Satya #ShakalakaShankar #Ali #RahulMadhav… pic.twitter.com/tMKXtv3UIi
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో, ఆయన అందించిన కథతో 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' తెరకెక్కింది. ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ప్రస్తుత విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. అమెరికన్ బేస్డ్ కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి దర్శకుడిగా పరిచయం అయ్యారు.
Also Read: భార్య ఎవరితో క్లోజ్‌గా ఉంటే వాళ్లను చంపేసే భర్త - నిజం తెలిశాక ఆమె ఏం చేస్తుంది?
'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాలో హాస్య నటుడు శ్రీనివాస రెడ్డి దర్శకుడి పాత్రలో కనిపించారు. ఆయన స్నేహితులుగా 'సత్యం' రాజేష్, 'షకలక' శంకర్ కనిపించారు. ఆయన తీసే సినిమాలో హీరోగా 'స్వామి రారా' సత్య చేసిన కామెడీకి థియేటర్లలో జనాలు పడీపడీ నవ్వారు. ఓటీటీలో ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.
'గీతాంజలి మళ్ళీ వచ్చింది' కథ ఏమిటి?
దర్శకుడు శ్రీను (శ్రీనివాస రెడ్డి) వరుసగా మూడు ఫ్లాపులు ఇవ్వడంతో అతడితో సినిమా చేసేందుకు నిర్మాతలు, హీరోలు ముఖం చాటేస్తారు. దాంతో ఖర్చులకు డబ్బుల కోసం స్నేహితుడు (స్వామిరారా సత్య)ను మోసం చేస్తారు. హీరోగా నటించి ప్రేమ వివాహం చేసుకోవాలని హైదరాబాద్ వచ్చిన ఆ స్నేహితుడికి తెలిసి చివరకు అందరూ ఇళ్లకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. ఆ సమయంలో శ్రీనుకు సినిమా చేసే అవకాశం ఇస్తాడు ఊటీలోని విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు (రాహుల్ మాధవ్). తను కథతో సంగీత్ మహల్‌లో షూటింగ్ చేయాలని కండిషన్ కూడా పెడతాడు. అందుకు ఓకే అని, తన స్నేహితురాలు అంజలిని కథానాయికగా పాత్ర చేసేలా ఒప్పిస్తాడు. సంగీత్ మహల్ చరిత్ర ఏమిటి? అందులో అడుగుపెట్టిన తర్వాత గీతాంజలి ఆత్మ ఎందుకు వచ్చింది? చివరకు ఏమైంది? అనేది సినిమా.