అన్వేషించండి

బిగ్‌బాస్‌ షోపై యాంకర్‌ రవి సంచలన వ్యాఖ్యలు, ఓటీటీకి బ్లాక్‌బస్టర్‌ మూవీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

ఏడాది తర్వాత ఓటీటీకి సూపర్‌ హిట్‌ మూవీ 'జర హట్కే జర బచ్కే'
Zara Hatke Zara Bachke OTT Release and Streaming Details: ఎట్టకేలకు బ్లాక్‌బస్టర్‌ చిత్రం'జర హట్కే జర బచ్కే' ఓటీటీ రిలీజ్‌ సిద్ధమైంది. దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమా డిజిటల్‌ వేదికపైకి రానుండటంతో ఆడియన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌, సారా అలీ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం 'జర హట్కే జర బచ్కే'(Zara Hatke Zara Bachke). రొమాంటిక్‌ అండ్‌ కామెడీ డ్రామా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'నువ్వు కొట్టలేదు.. చంపేశావు' - క్రికెటర్‌గా జాన్వీ కపూర్‌, ఆకట్టుకుంటున్న 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' ట్రైలర్‌ 
Mr and Mrs Mahi movie Trailer Out: బాలీవుడ్‌ టాలంటెడ్‌ యాక్టర్‌ రాజ్‌కుమార్‌ రావు, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మాహి'. స్పోర్ట్స్‌ డ్రామా తెరకెక్కితున్న ఈ సినిమా మే 31న థియేటర్లో రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మూవీ ట్రైలర్‌ని రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఈ సినిమా నిర్మాత కరణ్‌ జోహార్‌ తాజాగా సోషల్‌ మీడియా వేదికగా మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌ బాగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ టైటిల్‌ రోల్లో జాన్వీ కపూర్‌ నటిస్తుంది. క్రికెట్‌ ఆడిట అన్నా.. చూడటం అన్న ఇష్టం ఉండే భార్య పాత్రలో జాన్వీ నటించింది. తనకు ఇష్టమైన క్రికెట్ ను తండ్రి వల్ల విడిచిపెట్టిన కొడుకు పాత్రలో రాజ్ కుమార్ రావు నటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సినిమా అవకాశాలు తగ్గలే, వదులుకున్నా- దానికి కారణం అదేనంటున్న నవదీప్
Navadeep Lost Movie Offers : తెలుగు సినీ అభిమానులకు హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘జై’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవదీప్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘చందమామ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా కొన్ని హిట్స్ పడినా, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బిగ్ బాస్ వల్ల జీవితాలు నాశనం అయిపోయాయి..
Anchor Ravi About Bigg Boss: బుల్లితెరపై ఉన్న మోస్ట్ వాంటెడ్ మేల్ యాంకర్స్‌లో రవి కూడా ఒకరు. తనకంటూ ఒక సెపరేట్ స్టైల్‌తో బుల్లితెరపై ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్నాడు రవి. తాజాగా ఒక షోకు గెస్ట్‌గా వెళ్లిన రవి.. అసలు తన కెరీర్ ఎలా ప్రారంభమయ్యింది లాంటి ప్రొఫెషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. అంతే కాకుండా తను యాంకర్‌గా ఒక రేంజ్ క్రేజ్‌ను చూసిన తర్వాత బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్‌గా కూడా వెళ్లాడు. ఈ షోలో బిగ్ బాస్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రవి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Also Read: సినీ పరిశ్రమలో మరో విషాదం - రోడ్డు ప్రమాదంలో 'త్రినయని' సీరియల్‌ నటి దుర్మరణం

నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే
Manisha Koirala Emotional Struggles : మనీషా కొయిరాలా గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’, ‘భారతీయుడు’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో ఆమెకు క్యాన్సర్‌ సోకవడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. 2014లో క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఆమె ‘హీరామండి: ది డైమండ్ బజార్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి ఈ వెబ్ సిరీస్ కు పాక్ ప్రేక్షకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget