అన్వేషించండి

Navadeep : సినిమా అవకాశాలు తగ్గలే, వదులుకున్నా- దానికి కారణం అదేనంటున్న నవదీప్

గత కొంత కాలంగా సినిమా అవకాశాలు రావడం లేదంటూ వస్తున్న వార్తలపై హీరో నవదీప్ స్పందించాడు. తను ఓ సినిమాకు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగా అవకాశాలు వచ్చినా వదులుకున్నట్లు వెల్లడించాడు.

Navadeep Lost Movie Offers : తెలుగు సినీ అభిమానులకు హీరో నవదీప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ‘జై’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నవదీప్. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘గౌతమ్ ఎస్ఎస్సీ’, ‘చందమామ’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా కొన్ని హిట్స్ పడినా, ఆ తర్వాత అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. మెగా ఫ్యామిలీతో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా వారి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.

నవదీప్ పై బోలెడు రూమర్స్

నవదీప్ విషయంలో అప్పట్లో చాలా రూమర్స్ వినిపించేవి. ఒకేసారి వచ్చిన సెలబ్రిటీ స్టేటస్ తో క్రమశిక్షణ లేకుండా వ్యవహరించాడనే విమర్శలు వచ్చాయి. ఆయనకు ఉన్న వ్యసనాల కారణంగానే స్టార్ హీరోగా ఎదగలేకపోయాడనే టాక్ ఉంది. అమ్మయిలతో నవదీప్ వ్యవహార శైలి కూడా అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఆయన వేధింపుల కారణంగా నటి అంకిత ఆత్మహత్యా యత్నం చేసిందనే ప్రచారం జరిగింది. టాలీవుడ్ లో ప్రకంపనలు లేపిన డ్రగ్స్ కేసు వ్యవహారంలో నవదీప్ పేరు వినిపించింది.  

‘లవ్ మౌళి’ కారణంగానే అవకాశాలు వదులుకున్నా- నవదీప్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవదీప్ తనకు రీసెంట్ గా పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వివరించే ప్రయత్నం చేశాడు. నిజానికి తనకు అవకాశాలు రావడం లేదు అని చెప్పడం కంటే, తానే వదులుకున్నట్లు వివరించాడు. తన తాజా చిత్రం ‘లవ్ మౌళి’  కోసం తాను పెంచిన జుట్టు, గడ్డం కారణంగానే ఇతర సినిమాలను ఒప్పుకోలేదని చెప్పాడు. “2020 చివరల్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా. ఈ సినిమా కోసం జుట్టు, గడ్డం బాగా పెంచాను. వాస్తవానికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే జుట్టు, గడ్డం తీసేయాలి అనుకున్నాను. కానీ, లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. కంప్లీట్ అయ్యాక, ప్యాచ్ వర్క్స్ కోసం అలాగే ఉంచుకున్నాడు. ఈ టైమ్ లో ఒకటి రెండు తమిళ సినిమాలు మాత్రమే చేశాను. తెలుగు నుంచి అవకాశాలు వచ్చినా, గడ్డం, జుట్టు కారణంగా చేయలేకపోయాను. ఆ సినిమాకు ఇచ్చిన కమిట్మెంట్ కారణంగానే ఇతర సినిమాలను వదులుకున్నాను” అని నవదీప్ చెప్పుకొచ్చాడు. 

జూన్ 7న ‘లవ్ మౌళి’ విడుదల

చాలా కాలం తర్వాత నవదీప్ హీరోగా 'లవ్ మౌళి' సినిమా రాబోతోంది. పంఖురి గిద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.  భావన సాగి మరో ముఖ్యపాత్రలో కనిపించనుంది. అవ‌నీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 7న  విడుదల చేస్తున్నారు. నవదీప్ చివరి సారిగా ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ లో కనిపించాడు. ఇందులో బిందు మాధవి ఫీమేల్ లీడ్ లో కనిపించింది. శ్రీ ప్రవీణ్ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించాడు.  

Read Also: నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా

టాప్ హెడ్ లైన్స్

This Week Theatrical Movies : ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
ఈ వారం థియేట్రికల్ రిలీజెస్ - మెగా ప్రిన్స్ మూవీతో పాటు రొమాంటిక్ డ్రామా... ఒక్క రోజే 8 సినిమాలు
Podarillu Serial Today August 3rd: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
పొదరిల్లు: తల్లితండ్రులనే పోలీసులకు శైలు ఫిర్యాదు...శివంగి ఇంట్లో అందరిపై ఎందుకు విరుచుకుపడింది...?
Kattalan OTT : ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సునీల్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gundeninda Gudigantalu August 3rd Episode:మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?
గుండెనిండా గుడిగంటలు: మీనాపై ప్రభావతి ప్రేమ కురిపించడానికి కారణమేంటి..? బాలుకోసం వెతికి మీనాకు ఎవరు కనిపించారు..?

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Voter List Deletions: ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
ఏపీలో 44 లక్షల ఓట్లు గల్లంతు - నెల్లూరు, తిరుపతి, కడపలోనే ఎక్కువ.. ఏ పార్టీకి నష్టం?
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
West Bengal Industrial Revival: పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
పశ్చిమ బెంగాల్ పారిశ్రామిక రీ-ఎంట్రీ - సువేందు భవ్య రసాయన్ విజన్.. గుజరాత్, మహారాష్ట్రలకు పోటీగా నిలబడగలదా?
Breaking News: కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
కుత్బుల్లాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలు కూల్చివేత!
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
How To Save ₹100 Every Day:రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
రోజుకు 100 రూపాయలు సేవ్ చేస్తే మీ ఆర్థిక భవిష్యత్‌ ఎలా మారుతుంది?
Embed widget