Manisha Koirala Comments on Motherhood : నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా
Manisha Koirala on Motherhood : సీనియర్ నటి మనీషా కొయిరాలా తన జీవితంలో అత్యంత బాధకరమైన విషయాలను వెల్లడించింది. క్యాన్సర్ రావడం, పిల్లలు లేకపోవడం చాలా అవేదన కలిగించిందని చెప్పుకొచ్చింది.
![Manisha Koirala Comments on Motherhood : నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా Manisha Koirala On Cancer Affecting Her Motherhood Plans And Not Choosing Adoption Manisha Koirala Comments on Motherhood : నా జీవితంలో అత్యంత బాధించే విషయాలు అవే - అసలు విషయం చెప్పేసిన మనీషా కొయిరాలా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/12/e26671c2187d5ae7c5e6a7282baf9f861715495035576544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manisha Koirala Emotional Struggles : మనీషా కొయిరాలా గురించి భారతీయ సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’, ‘భారతీయుడు’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2012లో ఆమెకు క్యాన్సర్ సోకవడంతో కొంత కాలం పాటు సినిమాలకు దూరం అయ్యింది. 2014లో క్యాన్సర్ నుంచి కోలుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తాజాగా ఆమె ‘హీరామండి: ది డైమండ్ బజార్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించి ఈ వెబ్ సిరీస్ కు పాక్ ప్రేక్షకుల నుంచి సైతం ప్రశంసలు లభిస్తున్నాయి.
ఆ విషయాలు చాలా బాధపెట్టాయి- మనీషా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీషా కోయిరాలా కీలక విషయాలను వెల్లడించింది. తాను క్యాన్సర్ బారిన పడటం వల్ల తల్లి కాలేకపోయానని బాధ వరకు చాలా అంశాలను పంచుకుంది. “నా జీవితంలో చాలా అసంపూర్ణమైన విషయాలు ఉన్నాయి. చాలా కలలు ఉన్నాయి. అవి జరగవని నాకు తెలుసు. అందులో మాతృత్వం ఒకటి. అండాశయ క్యాన్సర్ రావడం నేను తల్లి కావడం అనేది సాధ్యం కాదు. బాధ కలిగినా తప్పదు అనుకుంటున్నాను. గతం నా చేతిలో లేదు. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.
దత్తత ఎందుకు తీసుకోలేదంటే?
తల్లిని కాలేకపోయినా, దత్తత తీసుకోవాలని చాలా ప్రయత్నించినట్లు చెప్పింది మనీషా. “నాకు పిల్లలు కాకపోయినా, దత్తత తీసుకోవడం గురించి చాలా ఆలోచించాను. అయితే, క్యాన్సర్ తర్వాత చాలా ఈజీగా ఒత్తిడికి గురవుతున్నాను. చీటికి మాటికి ఆందోళన కూడా పెరుగుతోంది. కాబట్టి నేను పిల్లలను కూడా దత్తత తీసుకోవాలనే ఆలోచనను విరమించుకున్నాను. నా పిల్లల కంటే, నన్ను ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని భావిస్తున్నాను. నేను తరచుగా మా స్వస్థలం ఖాట్మండు(నేపాల్)కు వెళ్తాను. వారితో టైమ్ స్పెండ్ చేస్తాను” అని ఆమె వెల్లడించింది.
రీసెంట్ ఇన్ స్టా వేదిక తన గురించి కీలక విషయాలను అభిమానులతో పంచుకుంది మనీషా. “జీవితంలో నేను కృతజ్ఞతతో ఉండాల్సిన క్షణాలు చాలా ఉన్నాయి. ఎన్నో ముఖ్యమైన పాత్రలు చేశాను. గొప్ప దర్శక నిర్మాతలతో పని చేశాను. కాలం నాకు పెట్టిన పరీక్షలో నెగ్గాను. భగవంతుడు దయతో జీవించడానికి నాకు రెండో అవకాశం లభించింది. క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత ఒడుదుడుకులు చూశా. కాలం పెద్ద గురువు. నేను ఇప్పుడు దాని విలువను తెలుసుకున్నాను” అని రాసుకొచ్చింది. తాజాగా ఆమె సీనియర్ నటీమణులతో కలిసి ‘హీరామండి’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మనీషాతో పాటు సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, అదితి రావ్ హైదరీ, షర్మిన్ సెగల్ మెహతా, ఫరీదా జలాల్, ఫర్దీన్ ఖాన్, జాసన్ షా, శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: నిన్న ఫొటోలు లీక్, నేడు లీగల్ నోటీసులు - నితీష్ తివారీ ‘రామాయణం’ చిత్రానికి తప్పని తిప్పలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)