అన్వేషించండి

ఉప్పెనంత దసరా - ఒక్కచోట చేరిన సుక్కూ ప్రియ శిష్యులు

సుకుమార్ శిష్యులైన బుచ్చిబాబు, శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్లుగా మారిపోయారు. తాజాగా వీరిద్దరూ కలిసి కాసేపు ముచ్చటించినట్లుగా బుచ్చిబాబు ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసాడు.

ప్రస్తుతం టాలీవుడ్ లో జీనియర్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల హవా నడుస్తోంది. ఈ లెక్కల మాస్టారు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసినవారు.. రైటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన వారు చాలామంది ఇప్పుడు మెగాఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. వారిలో బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరిద్దరూ డెబ్యూ సినిమాలతోనే వంద కోట్ల క్లబ్ లో చేరి గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు. 

'ఉప్పెన' సినిమాతో బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ అందుకుంటే.. లేటెస్టుగా 'దసరా' మూవీతో శ్రీకాంత్ ఓదెల కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చెరొక సినిమాతో ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్లుగా మారిపోయిన వీరిద్దరూ.. ఇప్పుడు ఒక్కచోట చేరారు. తాజాగా ఇద్దరు కలిసి ఉన్న ఓ ఫోటోని బుచ్చి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. తమ సినిమాల పేర్లు కలిసొచ్చేలా 'ఉప్పెనంత దసరా' అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి శ్రీకాంత్ స్పందిస్తూ 'బుచ్చిబాబు అన్న' అని రీట్వీట్ చేసారు. సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పటి నుంచే శ్రీకాంత్ - బుచ్చిబాబుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. ఇద్దరూ గురువు పేరు నిలబెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తదుపరి చిత్రాలతో టాప్ లీగ్ లో చేరిపోవాలని విషెస్ అందజేస్తున్నారు. 

కాగా, సుకుమార్ ప్రియ శిష్యుడైన బుచ్చిబాబు.. 'నాన్నకు ప్రేమతో' 'రంగస్థలం' వంటి చిత్రాలకు అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విభాగాల్లో పని చేసాడు. ఈ క్రమంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ - అందాల భామ కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 

బుచ్చిబాబు తొలి సినిమాతోనే రూ. 100 కోట్ల గ్రాస్ సాధించి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో.. ఒక్క దెబ్బతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌసెస్ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాయి. అయితే తనకు ఫస్ట్ అవకాశాన్ని అందించిన బ్యానర్స్ లోనే తన నెక్స్ట్ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో RRRతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ తో సినిమా చేసే గోల్డెన్ ఛాన్స్ అందుకున్నాడు బుచ్చిబాబు. 

RC16 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మెగా పవర్ స్టార్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రం చేస్తున్న చెర్రీ.. సెప్టెంబర్‌ లో బుచ్చిబాబు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాన్ ఇండియా మూవీ హిట్టయితే బుచ్చి స్టార్ డైరెక్టర్ గా మారే అవకాశం ఉంది.

మరోవైపు సుక్కూ వద్ద 'రంగస్థలం' సహా పలు చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్ ఓదెల.. 'దసరా' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. నేచురల్ స్టార్ నాని - కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల క్లబ్ లో చేరడమే కాదు.. ఓవర్ సీస్ లో 2 మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. తొలి సినిమానే పాన్ ఇండియా హిట్ కావడంతో, శ్రీకాంత్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పటికే కొన్ని పెద్ద నిర్మాణ సంస్థలు 'దసరా' దర్శకుడితో సినిమా చేయడానికి అడ్వాన్సులు ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇంకా శ్రీకాంత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. మరి త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందేమో చూడాలి.

Also Read : 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
AP Pensions News: ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
ఈ 31న నరసరావుపేటలో పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న చంద్రబాబు, షెడ్యూల్ పూర్తి వివరాలు
Southern states: దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
దేశంలో ఎక్కువ ఖర్చుపెట్టేది మహారాష్ట్ర, గుజరాత్ ప్రజలు కాదు -ఏపీ వాసులు- ఈ లెక్కలు షాకిస్తాయి!
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Telangana TDP: తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
తెలంగాణ టీడీపీ కోసం ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ రోడ్ మ్యాప్ - మహబూబ్ నగర్ నుంచి కార్యాచరణ?
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Embed widget