News
News
వీడియోలు ఆటలు
X

Rashmika Mandanna Sister : 'రెయిన్ బో' సెట్స్‌లో రష్మిక చిట్టి చెల్లెలు - ఎంత ఎదిగిపోయావమ్మా!

Rashmika Family Details Pics: రష్మికకు ఓ చిన్నారి చెల్లెలు ఉంది. ఆ విషయం ఫాన్స్ & ప్రేక్షకులకు తెలుసు. సెట్స్‌లో అక్క ఎలా యాక్టింగ్ చేస్తుందో తెలుసుకోవడం కోసం 'రెయిన్ బో' షూటింగుకు వెళ్ళింది చిన్నారి.

FOLLOW US: 
Share:

రష్మికా మందన్నా (Rashmika Mandanna)కు ఓ చిన్నారి చెల్లెలు ఉంది. అమ్మాయి పేరు షిమన్ మందన్నా (Rashmika sister Shiman Mandanna). తనతో పాటు ఆ చిన్నారి చెల్లెల్ని షూటింగులకు తీసుకు వెళ్ళడం రష్మికకు అలవాటు. తెలుగు చిత్రసీమకు పరిచయం కాక ముందు, కథానాయికగా రెండో సినిమా పునీత్ రాజ్ కుమార్ 'అంజనీ పుత్ర' సెట్స్‌కు తీసుకు వెళ్ళారు. లేటెస్టుగా 'రెయిన్ బో' సెట్స్‌కు కూడా తీసుకు వెళ్ళారు.  

షిమన్... ఎంత ఎదిగిపోయావమ్మా!
రష్మిక, దేవ్ మోహన్ (Dev Mohan) జంటగా రూపొందుతున్న సినిమా 'రెయిన్ బో' (Rainbow Movie). డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. చెన్నై, మున్నార్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశారు.

'రెయిన్ బో' షూటింగ్ చెన్నైలో జరిగినప్పుడు షూటింగుకు షిమన్ వెళ్ళారు. రష్మిక తల్లి సుమన్ కూడా! కర్ణాటకలోని కొడుగు జిల్లా రష్మిక సొంతూరు. ఆమె ఇంటికి దగ్గరలో ఎయిర్ పోర్టు కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే... అక్కడి నుంచి చెన్నైకు షిమన్ ఒంటరిగా వచ్చిందని రష్మిక పేర్కొన్నారు. 

అక్క యాక్టింగ్ ఎలా చేస్తుందో చూడటం కోసం షిమన్ మందన్నా చెన్నై వెళ్ళింది. వర్క్  (షూటింగ్) మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినప్పుడు షిమన్ ఇచ్చే హగ్స్ (కౌగిలింతలు) బెస్ట్ అని రష్మిక తెలిపారు. పిల్లలు చాలా చిన్నగా ఉన్నారని (అంటే ఎంతో ఎదిగిన చెల్లెల్ని ఉద్దేశిస్తూ) చెప్పుకొచ్చారు. రష్మిక చెల్లెల్ని ఇంటికి తీసుకు వెళ్ళడం కోసం తల్లి సుమన్ మందన్నా చెన్నై వెళ్ళారట. అదీ సంగతి!

నాన్ స్టాప్ షూటింగ్... 23 రోజులు! 
'రెయిన్ బో' ఫస్ట్ షెడ్యూల్ 23 రోజులు జరిగిందని, నాన్ స్టాప్ గా వర్క్ చేశామని రష్మిక తెలిపారు. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యిందని శనివారం చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాతో శాంతరూబన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... రష్మిక ఫస్ట్ పాన్ ఇండియా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రమిది.

Also Read : అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమాకూ భారీ బడ్జెట్ - 'ఏజెంట్' తర్వాత యువితో ఫిక్స్?

'రెయిన్ బో'ను తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. దీనిని హిందీ సహా ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తామని నిర్మాతగా ఎస్.ఆర్. ప్రభు స్పష్టం చేశారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా... ఎం. భాస్కరన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

సమంత టు రష్మిక!
తొలుత 'రెయిన్ బో'ను సమంత (Samantha)తో తీయాలని ప్లాన్ చేశారు. డ్రీమ్ వారియస్ పిక్చర్స్ సంస్థ నుంచి ఆమెతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటన కూడా వచ్చింది. అయితే, ఏమైందో? ఏమో? సమంత బదులు రష్మికతో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. అన్నట్టు... ఇటీవల విడుదలైన 'శాకుంతలం'లో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించారు. ఇప్పుడు రష్మికతో సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కాకుండా అల్లు అర్జున్ 'పుష్ప 2', రణబీర్ కపూర్ 'యానిమల్', నితిన్ - వెంకీ కుడుముల సినిమాలు చేస్తున్నారు రష్మిక. 

Also Read : గుడి ఓకే, అందులో సమంత ఎక్కడ? - ట్రోల్స్ చూస్తే నవ్వు ఆగదు!

Published at : 30 Apr 2023 09:32 AM (IST) Tags: Rashmika Mandanna Rainbow Movie Rashmika Sister Shiman Rashmika Mother Suman Rashmika Family Pics Rashmika Family Details

సంబంధిత కథనాలు

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

Vimanam Movie Review - 'విమానం' రివ్యూ : ఏడిపించిన సముద్రఖని, వేశ్యగా అనసూయ - సినిమా ఎలా ఉందంటే?

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం