అన్వేషించండి

Tollywood News Today : ఏపీ ప్రభుత్వానికి చిరు చురకలు, 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్, 'OMG 2' అప్డేట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారేంటీ? ఆ సమస్యలపై దృష్టిపెట్టండి: ఏపీ ప్రభుత్వానికి చిరంజీవి చురకలు

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మాస్ మహారాజా రవితేజతో కలిసి చిరంజీవి నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. శృతిహాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకోవడంతో పాటూ ఇప్పటికీ థియేటర్స్ లో విజయవంతంగా కొనసాగుతోంది. 'వాల్తేరు వీరయ్య' 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మూవీ టీం తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన 'జైలర్' (Jailer Movie) మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరి, బిజినెస్ సంగతి ఏంటి? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'పుష్ప2' నుంచి ఫహాద్ ఫజిల్ లుక్ వచ్చేసింది - మాస్ అవతార్‌లో టెర్రర్ పుట్టిస్తోన్న షెకావత్ సార్!

ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో 'పుష్ప ది రూల్' కూడా ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా 'పుష్ప ది రూల్' ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ టీజర్ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. అయితే ఈరోజు మలయాళ నటుడు ఫహాద్ ఫజిల్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ 'పుష్ప 2' నుంచి అతని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

‘OMG 2’కు ఇండియాలో ‘A’ సర్టిఫికెట్ - ఆ ఇస్లామిక్ దేశంలో మాత్రం ‘12A’, రెండిటికీ తేడా ఏమిటీ?

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘OMG 2’ మూవీకి ఆది నుంచి అవాంతరాలే ఎదురవ్వుతున్నాయి. ‘ఆదిపురుష్’ మూవీ ఇచ్చిన షాక్ వల్ల.. సెన్సార్ బోర్డు ఈ సినిమా విషయంలో కఠినంగా వ్యవహరించింది. డైలాగ్ నుంచి సీన్స్ వరకు ప్రతి ఒక్క అంశాన్ని నిశితంగా పరిశీలించింది. ఏకంగా అక్షయ్ కుమార్ పోషించిన శివుడి పాత్రనే మార్చేయాలంటూ సలహా ఇచ్చింది. అంతేకాదు సుమారు 24 కట్స్‌తో సినిమా రిలీజ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ సినిమా పెద్దలకు మాత్రమేనంటూ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో దేవుడి సినిమా అడల్ట్ సర్టిఫికెట్ ఏమిటంటూ అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సినిమా విడుదల తేదీ ప్రకటించిన నేపథ్యంలో చేసేది ఏమీ లేక దర్శక నిర్మాతలు సెన్సార్ సూచించినవన్నీ పాటిస్తామని చెప్పడంతో.. రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ సినిమాలో అక్షయ్‌ను మొదట్లో శివుడిగా చూపించారు. సెన్సార్ సూచనతో.. ఆయన్ని శివుడు పంపిన దూతగా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌లో కూడా మార్పులు చేసి.. అక్షయ్‌ను శివుడి దూతగా చూపించారు (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

'సలార్' నటీనటులకు హోంబలే ఆ కండిషన్ పెట్టిందా? - ఆ ఒక్కటీ లీక్ కాకూడదని!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా 'సలార్' (Salaar Movie). 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ ఈసారి ఏం తీసి ఉంటారు? కథ ఎలా ఉంటుంది? అనేది తెలుసుకోవాలని అభిమానులే కాదు... సగటు సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే... కథతో పాటు సినిమాలో ట్విస్టులు లీక్ కాకుండా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. 'సలార్' నటీనటులకు ఓ కండిషన్ పెట్టిందని టాక్! అది ఏమిటంటే... (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget