అన్వేషించండి

Jailer Theatrical Business : 'జైలర్' థియేట్రికల్ బిజినెస్ ఎంత? రజనీకాంత్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

Jailer Pre Release Business : సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. మరి, సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది?

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా నటించిన 'జైలర్' (Jailer Movie) మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరి, బిజినెస్ సంగతి ఏంటి? థియేట్రికల్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? ప్రపంచవ్యాప్తంగా ఎలా జరిగింది? అనే వివరాల్లోకి వెళితే... 

'జైలర్' తెలుగు రైట్స్ రూ. 12 కోట్లు!
Jailer Movie Telugu Rights : తెలుగు రాష్ట్రాల్లో 'జైలర్' థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 12 కోట్లకు మాత్రమే ఇచ్చారు. రజనీకాంత్ లాస్ట్ సినిమా 'పెద్దన్న' రైట్స్ కూడా అంతే! సూపర్ స్టార్ నటించిన గత కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన విజయాలు సాధించలేదు. అందుకని, డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ రేటు పెట్టి కొనడం లేదు. సేఫ్ గేమ్ ఆడుతున్నారు.

'జైలర్' పంపిణీ హక్కులను ఆంధ్ర ఏరియా వరకు 5 కోట్ల రూపాయల రేషియోలో విక్రయించారు. నైజాం హక్కులను రూ. 4.50 కోట్లకు ఇచ్చారని తెలిసింది. సీమ (సీడెడ్) హక్కులను రూ. 2.5 కోట్లకు ఇచ్చారట. తెలుగు రాష్ట్రాల వరకు బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 13 కోట్లు కలెక్ట్ చేయాలి.

రూ. 30 కోట్ల నుంచి రూ. 12 కోట్లకు...
రజనీకాంత్ మార్కెట్ కిందకు పడిందా?
ఆరేడేళ్ళ క్రితం వరకు రజనీకాంత్ సినిమాలకు తెలుగులో అగ్ర కథానాయకుల సినిమాలతో సమానంగా బిజినెస్ జరిగింది. 'కబాలి' (2016) సినిమా రైట్స్ తెలుగు రాష్ట్రాల్లో రూ. 31 కోట్లకు అమ్మారు. 'కాలా' అయితే రూ. 33 కోట్ల బిజినెస్ చేసింది. '2.0' సినిమాకు హిందీ హీరో అక్షయ్ కుమార్ విలన్ రోల్, శంకర్ డైరెక్షన్ యాడ్ కావడంతో బిజినెస్ విపరీతంగా జరిగింది. తెలుగులో ఆ సినిమా 70 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. 'పేట' రూ. 13 కోట్లు, 'దర్బార్' రూ. 14 కోట్లు బిజినెస్ చేశాయి అంతే!

Also Read : మానస్, దీపికల 'బ్రహ్మముడి' - ఈ సీరియల్ చెబుతోన్న జీవిత సత్యాలు

నిజం చెప్పాలంటే... రజనీకాంత్ సినిమాల బిజినెస్ తెలుగు రాష్ట్రాల్లో మునుపటి స్థాయిలో జరగడం లేదు. 'జైలర్' సినిమాతో మళ్ళీ సూపర్ స్టార్ పూర్వ వైభవం సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అదీ సంగతి!

టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే...
వంద కోట్లు క్రాస్ చేసిన 'జైలర్'!
తమిళనాడులో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. సూపర్ స్టార్ ఇమేజ్ ఇంపాక్ట్ చూపించింది. తమిళనాట 'జైలర్'ను రూ. 62 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్ల బిజినెస్ జరిగింది. 

కర్ణాటక రూ. 10 కోట్లు, కేరళ రూ. 5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రూ. 30 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగాయి. వరల్డ్ వైడ్ 'జైలర్' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122.50 కోట్లు జరిగాయి. 

బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?
'జైలర్' సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే... తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. వరల్డ్ వైడ్ చూస్తే... 124 కోట్ల రూపాయల షేర్ రావాలి. గ్రాస్ పరంగా చూస్తే... సుమారు 240 కోట్లు రావాలి. అదీ సంగతి!

Also Read : మోసాన్ని సహించలేడు, ఇబ్బంది పడితే తట్టుకోలేడు - ఇదీ 'బ్రహ్మముడి'లో రాజ్ రోల్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Embed widget