'పుష్ప2' నుంచి ఫహాద్ ఫజిల్ లుక్ వచ్చేసింది - మాస్ అవతార్‌లో టెర్రర్ పుట్టిస్తోన్న షెకావత్ సార్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పుష్ప2' నుండి ఫాహాద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అతని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ లో 'పుష్ప ది రూల్' కూడా ఒకటి. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. 'పుష్ప ది రైజ్' పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడంతో దాన్ని మించేలా 'పుష్ప ది రూల్' ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. మళ్లీ టీజర్ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. అయితే ఈరోజు మలయాళ నటుడు ఫహాద్ ఫజిల్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ 'పుష్ప 2' నుంచి అతని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో ఫహాద్ ఫజిల్ మాస్ అవతార్లో అదరగొట్టేసారు. ఈ లుక్ లో పోలీస్ చొక్కా ధరించి, సిగార్ తాగుతూ, సన్ గ్లాసెస్ పెట్టుకొని, గుండులో ఇంటెన్స్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.' పుష్ప రాజ్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు షెకావత్ సార్ తిరిగి వెండితెరపైకి వస్తున్నారంటూ' ఫహాద్ ఫజిల్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మేకర్స్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫహాద్ ఫజిల్ ఫస్ట్ లుక్ వైరల్ గా మారుతుంది. కాగా 'పుష్ప పార్ట్ 1' లో పుష్ప రాజ్ - భన్వర్ సింగ్ షేకావత్ మధ్య పోరు ప్రారంభమవుతుంది. రెండో భాగంలో వీళ్ళ మధ్య అసలైన యాక్షన్ ఉండబోతోంది. రీసెంట్ గానే సుకుమార్ ఓ షెడ్యూల్లో ఫహాద్ ఫజిల్‌కి సంబంధించిన సీన్స్ ని చిత్రీకరించారు.
Team #Pushpa2TheRule wishes the Massively Talented #FahadhFaasil a very Happy Birthday ❤🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 8, 2023
Bhanwar Singh Shekhawat Sir will be back on the big screens with vengeance 🔥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/kGBo7o4NlY
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. అంతేకాదు సినిమాలో కీలకమైన సన్నివేశాలు అన్నింటిని సుకుమార్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మిగతా పార్ట్ షూటింగ్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ప్రారంభించాలని మేకర్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది చివర్లోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం అవ్వడంతో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని రామోజీ ఫిలిం సిటీ లో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ వేసిన ప్రత్యేక సెట్ లో అల్లు అర్జున్ తో పాటు ఇతర కీలక నటీనటులపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
మైత్రి మూవీ మేకర్స్ సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా.. అనసూయ, సునీల్ లతో పాటూ సీనియర్ నటుడు జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 'పుష్ప' పార్ట్ 1 కి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ 'పుష్ప 2'ను ఇండియా వ్యాప్తంగానే కాకుండా చైనా, జపాన్, రష్యా వంటి ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial