అన్వేషించండి

Pawan Kalyan : నా హీరో మెగాస్టార్ - చిరు ఈవెంట్‌కు వస్తే నేను తమ్ముడినే... పవర్ స్టార్ స్పీచ్ హైలెట్స్

Pawan Kalyan Reaction : తనది అభిమానులను ప్రేమించే గోత్రం అని... ప్రజలకు సేవ చేసే నక్షత్రం అని అన్నారు పవన్ కల్యాణ్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశారు.

Pawan Kalyan's Speech In Ustaad Bhagat Singh Pre Release Event : తనకు మెగాస్టార్ చిరంజీవే హీరో అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ వేడుకకు మెగాస్టార్‌ను గెస్ట్‌గా పిలవాలని అనుకున్నారని... ఆయన వస్తే తాను ఏమీ మాట్లాడలేనని చెప్పినట్లు తెలిపారు. మీకు హీరో కావాలంటే నన్ను పిలవండి.. మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి అని చెప్పానన్నారు.

'సినిమా నాకు అన్నం పెట్టింది'

సినిమా తనకు అన్నం పెట్టిందని... ప్రజలకు సేవ చేసే గుర్తింపు ఇచ్చిందని అన్నారు పవన్ కల్యాణ్. 'ఎప్పుడూ నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమా ఎంత వసూలు చేసిందని నేను ఎప్పుడూ పట్టించుకోను. తెలుగు, తమిళ సినిమా అని చూడను. భారతీయ సినిమా అనే అనుకుంటాను. మన తెలుగు చిత్ర పరిశ్రమ ఆస్కార్ స్థాయికి చేరుకోవడం గొప్ప ఘనత. ఇలాంటి పరిశ్రమలో భాగం కావడం నాకు ఆనందంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి పక్కన ఉంటే నేను హీరో అన్న సంగతే మర్చిపోతాను. ట్రైలర్‌ను చూసి ట్వీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.

45 రోజుల్లోనే...

ఓ సినిమా విజయం సాధించాలనే అందరం కలిసి పని చేస్తామని... ఈ జర్నీలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటామని అన్నారు పవన్. 'గబ్బర్ సింగ్ తరువాత నేను, హరీష్ శంకర్ చేసిన సినిమా ఇది. మొదట ఒక కథ అనుకున్నా తర్వాత మారింది. కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత పాలిటిక్స్, ఎలక్షన్స్, పదవీ బాధ్యతలు స్వీకరించా. అన్నీ నెరవేరుస్తూనే చాలా తక్కువ టైంలో మూవీ కంప్లీట్ చేశా. 40 - 45 రోజుల్లోనే మూవీ పూర్తి చేశాం.

రోజుకి ఐదారు గంటల్లోపే పని చేశా. హరీష్ అంత బాగా ప్లాన్ చేశారు. నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసాను ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. పుష్ప, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను మైత్రి సంస్థ అందించింది. వాళ్లకు వరుస విజయాలు వస్తున్నాయంటే.. దాని వెనుక వారి కష్టం ఎంతో ఉంది.' అని చెప్పారు.

Also Read : ఆస్కార్ అవార్డుల సంబరం - బెస్ట్ మూవీ ఏంటో తెలుసా?... ఈసారి వెరీ స్పెషల్

ఫ్యాన్ డైరెక్టర్ అయితే...

ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం దర్శకుడు హరీష్ శంకర్ అని అన్నారు పవన్. 'మీలో ఒకడు దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్. తెలంగాణ నేల నుంచి పుట్టిన దర్శకుడు నన్ను ఇలా చూడాలని అనుకొని ఎంతో తపనతో మూవీ చేశాడు. హరీశ్ శంకర్‌కు హ్యాట్సాఫ్. గొప్ప పాండిత్యం ఉన్నవాడు. గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ అంత విజయం సాధిస్తుందని నేను కోరుకుంటున్నాను.

నాతో సహా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. మార్చి 19 ఉగాది రోజున ఈ సినిమాను మీకు చూపించడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. సినిమాను మన జీవితంలోనుంచి తీసేయలేము. మన అందరికీ ఉన్న గొప్ప వినోదం సినిమా. అందరు హీరోలు బాగుండాలి, అన్ని సినిమాలు ఆడాలి అని కోరుకుంటాను.' అని తెలిపారు.

నాది ప్రేమించే గోత్రం...

ఏపీ ప్రభుత్వం అన్నీ సినిమాలకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తుందని చెప్పారు పవన్ కల్యాణ్. 'అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు. అభిమానులకు, నాకు రెండు గుండెలు దూరం అంతే. నా సినిమా అంటే వినోదంతో పాటు, మంచి సందేశం కూడా ఉండాలి అనుకుంటాను. ఉస్తాద్ భగత్ సింగ్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నాది మిమ్మల్ని ప్రేమించే గోత్రం, సేవ చేసే నక్షత్రం.' అని అన్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget