ఆస్కార్ మీద కన్నేసిన శ్రీలీల..పెద్ద కలే ఇది!

శ్రీలీల..నితిన్ తో రాబిన్ హుడ్ మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతోంది

వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మార్చి 28న థియేటర్లలోకి వచ్చేస్తోంది

కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్

ప్రమోషన్లో భాగంగా రాబిన్ హుడ్ మేకింక్ వీడియో రిలీజ్ చేశారు..ఇందులో ఉంది ఆస్కార్ డైలాగ్

షూటింగ్ లో అల్లరి అల్లరి చేస్తోన్న శ్రీలీల..నాకు ఆస్కార్ రావాలి అంటూ చెప్పిన డైలాగ్ వైరల్ అవుతోంది

వీడియోలో ఆ వెంటనే.. పిచ్చోళ్ల గురించి వినడమే కానీ లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అనే డైలాగ్ పడింది

డాన్స్ లో చితక్కొట్టేసే శ్రీలీల రీసెంట్ గా పుష్ప 2 లో కిస్సిక్ అంటూ మెస్మరైజ్ చేసింది