Sai Rajesh: కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ యాక్టర్ కుమారుడు - మేమంతా పిచ్చోళ్లమా అంటూ 'బేబీ' డైరెక్టర్ రియాక్షన్
Babil Khan: బాలీవుడ్ యాక్టర్ బాబిల్ ఖాన్ ఇండస్ట్రీ తీరును ఎండగడుతూ పెట్టిన వీడియోపై ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. ఈ వివరణపై టాలీవుడ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Sai Rajesh Slams Slams Babil Khan Clarification: బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ (Irfan Khan) కుమారుడు బాబిల్ ఖాన్ (Babil Khan) కన్నీళ్లు పెట్టుకుంటూ 'బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ ఫేక్' అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో వెంటనే డిలీట్ చేసినా.. క్షణాల్లోనే వైరల్ కావడంతో అతని టీం క్లారిటీ ఇచ్చింది. కొందరు బాబిల్ ఆవేదనను తప్పుగా అర్థం చేసుకున్నారని.. వీడియోలో చెప్పిన యాక్టర్స్ అందరి నుంచి ఆయన స్ఫూర్తి పొందారని ఓ ప్రకటనలో వెల్లడించింది.
'బేబీ' డైరెక్టర్ ఆగ్రహం
బాబిల్ ఖాన్ టీం క్లారిటీపై టాలీవుడ్ డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తామేమైనా పిచ్చోళ్లలా కనిపిస్తున్నామా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 'మీరు ఏం చెప్పినా మేం ఏమీ మాట్లాడకుండా కూర్చుంటామని అనుకుంటున్నారా?. వీడియోలో బాబిల్ ప్రస్తావించిన వారు మాత్రమే మంచి వాళ్లు అయితే.. ఇంతకాలం అతనికి సపోర్ట్‌గా నిలిచిన మేమంతా పిచ్చోళ్లమా?. ఓ గంట ముందు వరకూ అతనికి సపోర్ట్‌గా నిలవాలని అనుకున్నా.
కానీ.. మీ తీరు చూశాక ఇక్కడితో ఆగిపోవడం మంచిది అనిపిస్తోంది. ఈ సానుభూతి ఆటలు ఇక పని చేయవు. మీరు నిజాయతీతో సారీ చెప్పాల్సిన అవసరం ఉంది.' అంటూ రాసుకొచ్చారు.
బాబిల్ రియాక్షన్
అయితే, దీనిపై బాబిల్ ఖాన్ సైతం అదే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'మీరు నా హార్ట్ ముక్కలు చేశారు. మీ కోసం నేనెంతో కష్టపడ్డాను. మీ మూవీలో పాత్రకు న్యాయం చేయడం కోసం రెండేళ్ల పాటు శ్రమించాను. ఎన్నో ఛాన్సెస్ వచ్చినా వాటన్నింటినీ వదులుకున్నా.' అంటూ రాసుకొచ్చారు. అయితే, ఇద్దరి పోస్టులు వైరల్ కావడంతో వెంటనే వాటిని డిలీట్ చేశారు.
అదే కారణమా?
'బేబీ' మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు సాయిరాజేష్. ఈ మూవీని బాలీవుడ్‌లో రూపొందించాలన్న ఆయన ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో హీరోగా బాబిల్‌ను ఎంచుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరిగిందో కానీ ఇలా వరుస పోస్టులు చేయడం వైరల్‌గా మారింది.
Also Read: నెల రోజుల్లోపే ఓటీటీలోకి తమన్నా హారర్ థ్రిల్లర్ - 'ఓదెల 2' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్.. తాజాగా కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ మర్యాద లేని పరిశ్రమ అని.. ఫేక్ ఇండస్ట్రీ అని బాబిల్ వీడియోలో చెప్తూ ఎమోషన్ అయ్యారు. అర్జున్ కపూర్, షనయా కపూర్, అనన్య పాండే వంటి వారి తీరును ఎండగట్టారు. పని చేయడానికి బాలీవుడ్ మంచి ప్లేస్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ తాను చూసిన వాటిల్లో ఫేక్ పరిశ్రమ బాలీవుడ్ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే, వీడియో పెట్టిన కొద్ది నిమిషాల్లోనే వైరల్ కాగా డిలీట్ చేశారు. 'ఖాలా' సినిమాతో ఇండస్ట్రీల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాబిల్.. ఇటీవల 'లాగ్ అవుట్' మూవీలో నటించారు.





















