Prakash Raj: పాక్ యాక్టర్ మూవీకి ప్రకాష్ రాజ్ సపోర్ట్ - నెట్టింట ట్రోలింగ్
Pak Actor Movie: పాక్ యాక్టర్స్ మూవీస్ బ్యాన్ చేయడాన్ని ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. సినిమాలపై నిషేధాన్ని తాను సమర్థించనని అన్నారు. దీంతో నెట్టింట ఆయన్ను విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Netizens Trolling On Prakash Raj: పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ యాక్టర్స్, వారు నటించిన మూవీస్, వారి సోషల్ మీడియా అకౌంట్స్, పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్స్‌పై భారత్ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే పాక్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' రిలీజ్‌పై బ్యాన్ విధించారు.
పాక్ యాక్టర్‌కు ప్రకాష్ రాజ్ సపోర్ట్
పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ (Fawad Khan) నటించిన బాలీవుడ్ మూవీ 'అబీర్ గులాల్' (Abir Gulaal) ఈ నెల 9న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేయగా బ్యాన్ విధించారు. అయితే, మూవీస్ రిలీజ్‌పై బ్యాన్ విధించడాన్ని ప్రకాష్ రాజ్ (Prakash Raj) తప్పుబట్టారు. 'ద లాలంటాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాజాగా మాట్లాడారు. 'సినిమాల నిషేధాన్ని నేను సమర్థించను.
అవి ఎలాంటి సినిమాలైనా సరే.. వాటిని ఆడియన్స్ నిర్ణయానికే వదిలేయాలి. ఫోర్నోగ్రఫీ, పిల్లలపై వేధింపులు ఉన్న చిత్రాలు మినహా వేటినీ నిషేధించకూడదు. ముందు సినిమా రిలీజ్ చేస్తే పాక్ యాక్టర్స్ సినిమాలు ఇక్కడ ఆడియన్స్ చూస్తారా లేదా అని తెలుస్తుంది. మూవీ రిలీజ్ చేసి ఆ రిజల్ట్ వారికే వదిలేస్తే మంచిది.' అంటూ కామెంట్స్ చేశారు.
నెట్టింట ట్రోలింగ్
అయితే, ప్రకాష్ రాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన పాక్ యాక్టర్స్, మూవీస్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడారని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ తీరును తప్పుబట్టారు. అయితే, పహల్గాం ఉగ్ర దాడిని ఖండిస్తూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా ఓ సుదీర్ఘ నోట్ విడుదల చేశారు. ఇది అమాయకులపై జరిగిన దాడి కాదని.. కశ్మీర్‌పై దాడి అంటూ పేర్కొన్నారు. కశ్మీర్ ఆట స్థలం కాదని.. యుద్ధ క్షేత్రం అంతకన్నా కాదని అన్నారు.
Also Read: హారర్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైన్స్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ ఇవే!
పాక్ నటుడు ఫవాద్ ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ వాణీ కపూర్ జంటగా నటించిన చిత్రం 'అబీర్ గులాల్'. ఈ మూవీకి ఆర్తి ఎస్.బాగ్డి దర్శకత్వం వహించగా.. వివేక్ అగర్వాల్ నిర్మించారు. నిజానికి పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ మూవీస్‌లో నటించడం మానేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ సినిమాలో ఫవాద్ నటించారు. సరిగ్గా రిలీజ్ అవుతుందనుకునే సమయంలో పహల్గాం ఉగ్ర దాడి ఘటనతో నిషేధం పడింది. 'అబీర్ గులాల్' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఆ సినిమా పోస్టర్‌ను పోస్ట్ చేయగా హీరోయిన్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు నెటిజన్లు.
మరోవైపు.. ఇప్పటికే పాక్‌కు సింధు జలాల నిలిపివేత సహా పలు ఆంక్షలు విధించింది భారత్. పాకిస్థానీయులు దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్, పాక్ సెలబ్రిటీల అకౌంట్స్ అన్నింటినీ డీయాక్టివేట్ చేసింది.




















