Odela 2 OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి తమన్నా హారర్ థ్రిల్లర్ - 'ఓదెల 2' స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Oedla 2 OTT Platform: మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ 'ఓదెల 2'. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది.

Tamannaah's Odela 2 OTT Release On Amazon Prime Video: మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) శివశక్తిగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ 'ఓదెల 2' (Odela 2). ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. థియేటర్లలోకి వచ్చిన నెలలోపే తాజాగా ఓటీటీలోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) సొంతం చేసుకోగా.. ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. నాలుగేళ్ల క్రితం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. తమన్నా నాగసాధువుగా నటించి మెప్పించారు.
Also Read: హారర్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైన్స్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ ఇవే!
ఈ సినిమాను మధు క్రియేషన్స్, సంపత్ నంది (Sampath Nandi) టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై డి.మధు, సంపత్ నంది నిర్మించారు. సంపత్ నంది కథ అందించగా అశోక్ తేజ దర్శకత్వం వహించారు. సినిమాలో హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి 'కాంతర', 'విరూపాక్ష' సినిమాల ఫేం అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీకి కూడా సీక్వెల్ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.
స్టోరీ ఏంటంటే?
ఓదెల గ్రామంలో శోభనం రోజే పెళ్లి కుమార్తెలను అత్యాచారం చేసి చంపేస్తాడు తిరుపతి (వశిష్ట సింహ). ఈ విషయం తెలుసుకున్న అతని భార్య రాధ (హెబ్బా పటేల్) తిరుపతిని తల నరికి చంపేస్తుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే, అతని ఆత్మ ఘోష అనుభవించాలంటూ ఓ పూజారి సూచన మేరకు తిరుపతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించకుండా సమాధి శిక్ష వేస్తారు ఊరి జనం. తిరుపతి పీడ విరగడైపోయిందని అనుకుంటారు.
అయితే, మళ్లీ గ్రామంలో పెళ్లి సందడి మొదలవుతుంది. సమాధి శిక్షలో ఉన్న తిరుపతి ఆత్మ భయంకర ప్రేతాత్మగా మారుతుంది. అప్పటిలానే శోభనం రోజే ఇద్దరు అమ్మాయిలను వేరే వారిలో ప్రవేశించి అత్యాచారం చేసి చంపేస్తాడు తిరుపతి. అతను మళ్లీ ప్రేతాత్మగా మారాడని ఊరి ప్రజలకు తెలిసి ఆందోళన చెందుతారు. జైల్లో ఉన్న రాధకు విషయం చెప్పగా భైరవి (తమన్నా) గురించి చెప్పి ఆమెను కలవాలని వారికి చెబుతుంది. అసలు భైరవి ఎవరు? ఆ ప్రేతాత్మ పీడ నుంచి ఓదెలకు ఎలా విముక్తి కల్పించింది. తిరుపతి ప్రేతాత్మ, భైరవికి మధ్య ఎలాంటి యుద్ధం జరిగింది. స్టోరీలో అల్లా భక్షు (మురళీ శర్మ) పాత్ర ఏంటి? చివరకు ఏం జరిగింది? ఆ శివయ్య ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















