NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - బర్త్ డే రోజు రెండు గిఫ్ట్స్?
NTR Movies Updates: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే రోజు ఫ్యాన్స్ అదిరిపోయే సర్ ప్రైజ్‌లు అందనున్నాయి. ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లింప్స్ రిలీజ్ కానుండగా.. 'వార్ 2'లో ఫస్ట్ లుక్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.

Glimpse Of NTR Neel Movie On His Birthday: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) బర్త్ డే రోజు ఫ్యాన్స్‌కు వరుస సర్‌ప్రైజ్‌లు అందనున్నాయి. ఈ నెల 20న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ నీల్ (NTR Neel) ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది. ఇదే సమయంలో ఆయన నటించిన 'వార్ 2' మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఒకే రోజు రెండు గిఫ్ట్స్
అదే రోజు ఎన్టీఆర్ 'వార్ 2' (War 2) మూవీ నుంచి ఆయన లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మూవీ టీం సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే. ఒకే రోజు రెండు గిఫ్ట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు మూవీస్‌పై భారీ క్రేజ్ నెలకొంది.
ఎన్టీఆర్ నీల్ మూవీపై..
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి బజ్ మామూలుగా లేదు. ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేసినా.. తాజాగా.. 2026, జూన్ 25కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా వెల్లడించారు మేకర్స్.
భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్, టీ సిరీస్ ఫిలిమ్స్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్) సమర్పణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఇంటర్నేషనల్ లెవల్ అంటూ రవిశంకర్ పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కర్ణాటకలో యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ కాగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
'వార్ 2' మూవీపై..
ఇక.. ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మూవీ 'వార్ 2'. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఈ మూవీలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఎన్టీఆర్ 'రా' (RAW) ఏజెంట్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఏజెంట్ పాత్రలన్నింటి కంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ డిఫరెంట్‌గా ఉండనున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా అదే రోజున ఈ అప్ డేట్స్‌తో పాటు ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'యమదొంగ' రీ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఈ సినిమా మళ్లీ విడుదల కానుంది.





















