Upcoming Telugu Movies: హారర్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైన్స్ వరకూ.. - ఈ వారం థియేటర్స్, ఓటీటీల్లో వచ్చే మూవీస్ ఇవే!
Latest Telugu Movies: ఈ వారం మూవీ లవర్స్‌కు నిజంగా పండుగే. సమ్మర్ స్పెషల్‌గా హారర్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైనర్స్ వరకూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Upcoming Telugu Movies OTT Releases In May Second Week: ఈ వారం హారర్ కామెడీ నుంచి యాక్షన్ ఎంటర్‌టైన్స్ వరకూ కొత్త మూవీస్, వెబ్ సిరీస్‌లు అలరించనున్నాయి. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సందడి చేయనున్నాయి. ఆ మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే..
శ్రీవిష్ణు '#సింగిల్'
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ '#సింగిల్' (#Single). కేతికాశర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని కామెడీ ఎంటర్‌టైనర్‌గా కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్ కీలక పాత్ర పోషించగా.. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.
సమంత 'శుభం'
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నిర్మించిన 'శుభం' (Subham) ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె సొంత నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించగా.. హర్షిత్ రెడ్డి, సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. కామెడీ, హారర్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కింది.
Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - బర్త్ డే రోజు రెండు గిఫ్ట్స్?
క్రైమ్ థ్రిల్లర్ 'బ్లైండ్ స్పాట్'
నవీన్ చంద్ర, రాశీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'బ్లైండ్ స్పాట్'. రాకేశ్ వర్మ దర్శకత్వం వహించగా.. ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన లుక్స్, ప్రచార చిత్రాలు మూవీపై హైప్ భారీగా పెంచేశాయి.
'కలియుగమ్ - 2064'
శ్రద్ధా శ్రీనాధ్, కిశోర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కలియుగమ్ - 2064' ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ కానుంది. భవిష్యత్తులో అంటే 2064లో మనుషులు ఎలా ఉంటారో ఈ మూవీలో చూపించనున్నారు.
మెగాస్టార్ మూవీ రీ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ 'జగదేకవీరుడు అతిలోక సుందరి' (Jagadeka Veerudu Athiloka Sundari). దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వం వహించిన ఈ ఐకానిక్ సోషియో - ఫాంటసీ మూవీ విడుదలై ఈ నెల 9 నాటికి 35 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 9న రీ రిలీజ్ చేయనున్నారు.
ఓటీటీల్లో మూవీస్/వెబ్ సిరీస్‌ల లిస్ట్
- నెట్ ఫ్లిక్స్ - గుడ్ బ్యాడ్ అగ్లీ (తమిళం/తెలుగు) - మే 7, ది మ్యాచ్ (మే 7), లాస్ట్ బుల్లెట్ (మే 7), బ్యాడ్ ఇన్‌ఫ్లూయెన్స్ (మే 8), ది హాంటెడ్ అపార్ట్‌మెంట్ 'మిస్సిక్' (మే 8), ది డిప్లొమ్యాట్ (మే 9), ది రాయల్స్ వెబ్ సిరీస్ (మే 9).
- అమెజాన్ ప్రైమ్ వీడియో - గ్రామ్ చికిత్సాలయ్ (హిందీ - మే 9)
- జియో హాట్ స్టార్ - స్టార్ వార్స్ (యానిమేషన్ మూవీ - మే 4), యువ క్రైమ్ ఫైల్స్ (మూవీ - మే 5), పోకర్ ఫేస్ (వెబ్ సిరీస్ - మే 9)
- ఈటీవీ విన్ - అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (మే 8)




















