అన్వేషించండి

The Kerala Story 2 Censor Review : 'ది కేరళ స్టోరీ 2' సెన్సార్ రివ్యూ - U/A సర్టిఫికెట్‌పై మూవీ టీం రియాక్షన్

The Kerala Story 2 Review : వివాదాల 'ది కేరళ స్టోరీ 2' కు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. దీనిపై స్పందించిన మూవీ టీం... నెక్స్ట్ జనరేషన్‌కు సందేశం చేరాలనే ఈ మూవీ రూపొందించినట్లు చెప్పారు.

The Kerala Story 2 Movie Censor Review : రిలీజ్‌కు ముందే కాంట్రవర్సీస్... ఎన్నో వివాదాల తర్వాత 2023లో రిలీజైన మూవీ 'ది కేరళ స్టోరీ'. అప్పట్లో విమర్శలకు ప్రశంసలు సైతం అందుకుంది. దీనికి సీక్వెల్‌గా 'ది కేరళ స్టోరీ 2' రూపొందగా తాజాగా ట్రైలర్ సైతం రిలీజ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ సాగింది. తాజాగా ఈ మూవీకి సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేసింది. 

సెన్సార్ రివ్యూ

ఫస్ట్ పార్ట్ 'ది కేరళ స్టోరీ'కి అప్పట్లో సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. వివిధ సీన్స్ తొలగించాలని మూవీ టీంకు సూచించింది. ఇక లేటెస్ట్‌గా వచ్చిన 'ది కేరళ స్టోరీ 2'కు మాత్రం U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సీక్వెల్ పిల్లల నుంచి పెద్దల వరకూ నిర్భయంగా చూడొచ్చు. సెన్సార్ నిర్ణయంపై మూవీ టీం హర్షం వ్యక్తం చేసింది. ఇది తమ విజయంగా పేర్కొంది. 

''ది కేరళ స్టోరీ 2'కు U/A సర్టిఫికెట్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. మేము ఈ మూవీ తీయడం వెనుక ఉన్న ఉద్దేశం దేశ ప్రజలందరికీ చేరుతుంది. మహిళలకు కొన్ని విషయాలపై అవగాహన కల్పించడమే మా లక్ష్యం. నెక్స్ట్ జనరేషన్‌కు మా సందేశం చేరాలనే ఈ చిత్రాన్ని రూపొందించాం.' అని పేర్కొన్నారు. 

Also Read : మహేష్ బాబు 'వారణాసి' బిగ్ అప్డేట్ - మ్యూజిక్ వర్క్స్‌పై కీరవాణి ఏమన్నారంటే?

ట్రైలర్ కాంట్రవర్శీ... సీఎం ఆగ్రహం

'ది కేరళ స్టోరీ 2' ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ చేయగా వివాదం నెలకొంది. ఈ మూవీకి కమాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా... ఉల్కా గుప్తా, ఆదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్‌లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో నివసించే యువతుల కథను చూపించారు. ప్రేమ పేరుతో మోసపోయిన యువతులు మత మార్పిడికి గురవుతున్నారంటూ తెలియజేసేలా ఈ వీడియో కట్ చేశారు. 'ఈసారి మౌనంగా ఉండం... పోరాడతాం' అంటూ మెసేజ్ ఇస్తూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మరోవైపు, ఈ మూవీపై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లో సీన్స్ మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని... 'ది కేరళ స్టోరీ 2'పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్న్ చేశారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ సినిమా తెరపైకి తీసుకొచ్చారని... రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసేలా ఉందని అన్నారు. మూవీపై కాంగ్రెస్ కూడా అభ్యంతరం తెలిపింది. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'ది కేరళ స్టోరీ' స్ట్రీమింగ్ ఎందులో అంటే?

'ది కేరళ స్టోరీ' మూవీని సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా... విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్‌లో ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇర్నానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

DC Movie OTT : ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి లోకేశ్ కనగరాజ్ DC మూవీ - స్టార్ డైరెక్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?
Irumudi Trailer : ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
ఇరుముడి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఇంజినీరింగ్ కాలేజీలో గ్రాండ్ ఈవెంట్... ఫుల్ డీటెయిల్స్
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget